ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్న ప్రియాంక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకం

ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావాలని చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో డిమాండ్లు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా తొలిసారి ఉత్తరప్రదేశ్ను పార్టీపరంగా రెండుగా తూర్పు పశ్చిమ విభజించి , ఇద్దరు ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటివరకు నలుగురు పిసిసి కార్యవర్గ అధ్యక్షులతో యూపీలో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు విభజించిన రెండు భాగాల్లో ఒక దానిని ప్రియాంకకు రెండో దానిని గ్వాలియర్ మధ్యప్రదేశ్ రాజ కుటుంబీకుల జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

దేశానికే కీలకమైన యూపీలో కోల్పోయిన పట్లు తెలుగు సాధించడం లక్ష్యంగా ఈ విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. జోహార్ లాల్ నెహ్రూ సొంత ఊరు అలహాబాద్ తో పాటు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ కు పట్టున్న గోరకపూర్ వంటివి ఇప్పుడు ప్రియాంక పరిధిలోకి రానున్నాయి.

గాంధీ క్రమంగా అన్ని బాధ్యతల నుంచి వైదొలగుతు వస్తున్నందున వచ్చే ఎన్నికల్లో రాయబరేలీ లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగే అవకాశాలు కూడా మొండిగా కనిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కాంగ్రెస్ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంటుంది పార్టీ వర్గాలు అంచనా.

రాహుల్ గాంధీపై ప్రజలను వ్యతిరేక భావన ప్రియాంక పై లేదని చెప్పవచ్చు. లోక్ సభ ఎన్నికల అనంతరం మిత్రపక్షాలైన రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతు ఇవ్వడానికి సంకోచించిన పక్షంలో కాంగ్రెస్ లో నుంచి ప్రియాంకా ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకు రావచ్చు వ్యక్తం అవుతుంది.

హిందీ రాష్ట్రాల్లో ఈమె ప్రభావం కాంగ్రెస్కు సరికొత్త శక్తిని ఇస్తుందన నమ్ముతున్నారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను నానమ్మ ఇందిరాగాంధీ ప్రతిరూపంగా సహజ నాయకత్వ లక్షణాలు నేతగా చూస్తూ వస్తున్నారు.

పాత తరం కాంగ్రెస్ ఓటర్లు అంతా తిరిగి శక్తిని పొందుకొని బలంగా పని చేయడానికి వీలు ఉంటుందని అంచనా ఉం.ది ముఖ్యంగా యువత విద్యావంతులు మహిళలు తొలిసారి ఓటు వెయ్యి బొయేవారిని ప్రియాంక తన వైపు తిప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *