ఐదు స్థానాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, జాతీయ నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి

ఆ ఐదింటిపై కమలం గురి!

లోక్‌సభలో ఎన్నికల్లో పట్టు సాధించాలని ఓటు బ్యాంకు ప్రాతిపదికగా బరిలోకిప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ నాయకత్వం.

రాష్ట్రంలోని 5 కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నప్పటికీ ఈ ఐదింటిని మాత్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, గతంలో పార్టీకి వచ్చిన ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని.

పార్టీ సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌తో పాటు మల్కాజిగిరి, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి, కేడర్‌ను సమాయత్తం చేయాలని, అభ్యర్థులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని నిర్ణయించింది.

గత పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీతో కలిసి రాష్ట్రంలో 8 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ సికింద్రాబాద్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ ఓటమి చవిచూసినా, ఓటుబ్యాంకు కొంతమేర నిలుపుకొంది.

గతంలో పార్టీ తరఫున ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన సందర్భాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ ఐదు స్థానాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని జాతీయ నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఐదింటిలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలు మహరాష్ట్ర సరిహద్దున ఉండటం గమనార్హం. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలకు పైగా బీజేపీ పట్టు నిలుపుకొంటూ వస్తోంది.

ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు గతంలో కరీంనగర్‌ ఎంపీగా రెండుసార్లు విజయం సాధించారు.

నిజామాబాద్‌లో పార్టీకి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ గతంలో ఎంపీగా పోటీ చేసి 2.25 లక్షల ఓట్లు సాధించారు.
మల్కాజిగిరిలో బీజేపీ 2009 ఎన్నికల్లో 11ు ఓట్లు సాధించగా, ఈ పార్టీతో పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గెలిచిన సంగతి తెలిసిందే.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు 45 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.

ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలోనూ తమకు అనుకూల పవనాలు వీస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *