గ్రీన్ కార్డులు జారీ చేయడంలో పాటిస్తున్న కోటా విధానాన్ని ఎత్తివేసే బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి

వలసదారులకు గ్రీన్ కార్డుల జారీ చేయడంలో పాటిస్తున్న కోటా విధానాన్ని ఎత్తివేసే బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి. ఇది ఆమోదం పొంది చట్ట రూపం దాల్చితే అగ్రరాజ్యం లోని భారతీయ నిపుణులకు ప్రయోజనం కలగనుంది. గ్రీన్ కార్డుల కోసం వారు నిరీక్షించు వలసిన సమయం గణనీయంగా తగ్గనుంది.

ఈ బిల్లును సహచరుడు మైక్ లీతో కలిసి భారతీయ అమెరికన్ సెనేటర్ కమలా హరీష్ బుధవారం సెనెట్లో ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో 112 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఇదే తరహా బిల్లును జో లాపెగన్, కెన్ బక్ లు ప్రవేశపెట్టారు.

ఈబిల్లులకు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో సభ్యుల మద్దతు ఉంది. గూగుల్, వాల్మార్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా వీటిని సమర్థిస్తున్నాయి. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు ఉద్యోగం చేసుకునేందుకు వలసదారులకు వీలు కల్పించే దేగ్రీన్ కార్డ్.

ఉద్యోగ ఆధారిత ఈబీ వీసాలకింద అమెరికాఏట 1.4 లక్షల మంది గ్రీన్ కార్డులు ఇస్తుంది. అయితే ఒక దేశం వారికి గరిష్టంగా వీటిలో ఏడు శాతానికి మించి కేటాయించకుండా ప్రస్తుత చట్టంలో పరిమితులు ఉన్నాయి.

జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు తక్కువ ఉన్న దేశాలకు కోటఒకేలా ఉంది. ఏటా ఈబీ విశాఖ కింద ఒక దేశం వారు 9800 కు మించి గ్రీన్ కార్డులను పొందలేరు. భారత్-చైనా వంటి దేశాల నుంచి దరఖాస్తుల వెల్లువ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏటపెద్ద సంఖ్యలో పేరుకు పోతున్నాయి.

ఆయా దేశాల వారు తమ వంతు కోసం వేచి చూడాల్సి వస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *