రాష్ట్రంలో రానున్నది వైసిపి హవ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ హవా స్పష్టంగా కనబడుతోంది అని ప్రతి సర్వేలలో వస్తున్న ఫలితాలను బట్టి మరియు జగన్ సభలకు వస్తున్న జనాన్ని బట్టి నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
గత సార్వత్రిక ఎన్నికలలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మరియు కొద్దిపాటి నిర్లక్ష్యంతో కేవలం 5% ఓటు తేడాతో అధికారం కోల్పోయిన జగన్ ప్రతిపక్ష నేతగా అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పై అద్భుతంగా ప్రజావ్యతిరేకతను బయటకు తీసుకు వచ్చిన అపోజిషన్ లీడర్ గా రాణించారు.
అయితే పాదయాత్ర చేపట్టిన తరువాత జగన్ ప్రజలలో అద్భుతమైన నమ్మకాన్ని సంపాదించుకుని ఏ విధంగా చంద్రబాబు అబద్దాలు చెప్పే అధికారం లోకి వచ్చారు వంటి విషయాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ అధికారపార్టీకి మరియు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న జగన్ .
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఒక్కసారిగా 175 మంది నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించి తన తండ్రి సమాధి వద్ద నుండి దూకుడుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ .
ఇంకా 21 రోజులు ప్రజల నమ్మకాన్ని ఎలా కాపాడుకుని ఆ నమ్మకాన్ని ఓటుగా మలచుకుంటారో అని సీనియర్ రాజకీయ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే వైసీపీ పార్టీ కి సంబంధించిన ఓట్లను తొలగించడం మరియు బలమైన అభ్యర్థులపై దాడులకు తెగ పడటం వంటివి చూస్తుంటే అధికార పార్టీ టిడిపి కి ఓటమి దగ్గరలో ఉందని ఇందుమూలంగా నే ఇలా వ్యవహరిస్తున్నారని చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన పార్టీ నాయకులపై కార్యకర్తలపై, అభ్యర్థులపై అధికార పార్టీ చేస్తున్న దాడులను జగన్ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరోపక్క అధికార పార్టీ టిడిపి చేస్తున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర బలగాలను రాష్ట్రంలో దింపాలని ఇప్పటికే జగన్ సూచించిన విషయం మనకందరికీ తెలిసినదే.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగిస్తున్న క్రమంలో కేంద్ర బలగాలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అదుపులోకి తీసుకునే విధంగా మోహరింపు చేస్తే కచ్చితంగా ఎన్నికలు శాంతికరమైన వాతావరణంలో జరుగుతాయని దాడులు అరికట్టవచ్చని అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు.
ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు మొత్తం జగన్ ని నమ్ముతున్న నేపథ్యంలో తన పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత కోసం జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మరికొంతమంది నేతలు పేర్కొంటున్నారు.