ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియాటుడే. ఎన్నికల నేపథ్యంలో

- 1.ఇండియాటుడే సర్వేః ఏపీ గ్రాఫ్స్ ఇలా!
- 2.ఆరునెలల కిందటితో పోలిస్తే.
- 3.ఆరునెలల కిందట జగన్ కు 43శాతం మంది మద్దతు కనిపించిందని.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియాటుడే.
ఎన్నికల నేపథ్యంలో వివిధ సర్వేలు నిర్వహిస్తూ వస్తున్న ఈ ఇంగ్లిష్ వార్తా చానల్ తాజాగా ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి తన అంచనాలను వెలువరించింది.
వాటి ప్రకారం.. ఆరునెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగింది.
ఆరునెలల కిందట జగన్ కు 43శాతం మంది మద్దతు కనిపించిందని, గత ఏడాది సెప్టెంబర్లో ఆ పరిస్థితి ఉండగా.. ఈ ఏడాది ప్రస్తుత నెల ఫిబ్రవరిలో జగన్ కు లభించిన మద్దతు శాతం 45 అని ఇండియాటుడే పేర్కొంది.
జగన్ గ్రాఫ్ లో రెండు శాతం పెరుగుదల నమోదైందని ఈ చానల్ పేర్కొంది.
ఇదే సమయంలో ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి గ్రాఫ్ రెండుశాతం పతనం అయ్యిందని ఇండియాటుడే వివరించింది.
గత ఏడాది సెప్టెంబర్లో బాబుకు లభించిన మద్దతు శాతం 38 కాగా, ఇప్పుడు 36శాతం మంది మాత్రమే బాబును సపోర్ట్ చేస్తున్నారని ఇండియాటుడే పేర్కొంది.
ప్రస్తుతానికి జగన్ కు 45శాతం మద్దతు ఉండగా, బాబుకు 36 శాతం మంది మద్దతు ఉందని ఇండియాటుడే వివరించింది.
వ్యత్యాసం తొమ్మిది శాతం అని పేర్కొంది. ఇక పవన్ గ్రాఫ్ లో ఒకశాతం తగ్గుదల నమోదైందని ఇండియాటుడే వివరించింది.
గత ఏడాది సెప్టెంబర్ నాటికి పవన్ కు ఉండిన మద్దతు శాతం ఐదు కాగా, ప్రస్తుతం పవన్ గ్రాఫ్ నాలుగు శాతం వద్ద ఉందని పేర్కొంది.
ఇతరులకు ప్రస్తుతానికి 15శాతం మద్దతు ఉందని తమ సర్వేలో తేలినట్టుగా వివరించింది ఇండియాటుడే.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సాధించుకున్న ఓట్ల శాతం మధ్య తేడా అత్యల్పం అని.. అలాంటి చోట జగన్ తొమ్మిది శాతం లీడ్ లో ఉండటం వచ్చేసారి భారీ వ్యత్యాసం ఉండోబోతోందని చెప్పడానికి రుజువని ఆ చానల్ అభిప్రాయపడింది.