వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై డ్రోన్ల తో నిఘా… చంద్రబాబు కుటిల రాజకీయం

చంద్రబాబు నాయుడు హైటెక్ రాజకీయ నాయకుడు అని ముద్ర ఎప్పుడో సంపాదించుకున్నారు. టెక్నాలజీని అడ్డుగొలు గా వాడుకోవడంలో ఆయనకి మించిన వారు లేరు.
తాజాగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా చౌర్యం కేసు కూడా అలాంటిదే.
అందుకే బాబు ఎన్నికలకు వస్తున్నాడు అంటే ఆయన ఏం చేస్తారో… ఎలాంటి సాంకేతిక మాయలు సృష్టిస్తారో… అని ప్రజలు భయపడుతూ ఉంటారు.
తాజాగా ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల మీద లో డ్రోన్ లను సంధిస్తున్నారు. వారిని అడుగడుగునా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పర్వం నువ్వా నేనా అన్నట్లు గా జరుగుతుంది. పలు సర్వేల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజాభిమానం అనుకూలంగా ఉన్నట్లు వినిపిస్తుండడంతో చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నచోట వాళ్ల కదలికలు ఎలా ఉంటున్నాయి ఎవరెవరు వచ్చివెలుతున్నారు.
తదితర వివరాలను సేకరించేందుకు డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
గుంటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికార్యాలయం మీద కూడా సాగుతోందని అంటున్నారు.
సాధారణంగా వినియోగించాలంటే వ్యక్తి అయినా సరే ముందస్తుగా పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ ఇలాంటి వాటికి అనుమతులు అవసరం ఉండదు అనిపించేలా డ్రోన్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఎడాపెడా నిఘా పెడుతూ ఉన్నాయి.
డ్రో న్ల ద్వారా కదలికలను గమనిస్తూ ఉండడం స్వేచ్ఛగా తిరగకుండా నియంత్రించడం నిబంధనలు అతిక్రమిస్తున్నరంటు పితూరీ లతో వారిని ఉక్కిరి బిక్కిరి చేయడం లక్ష్యంగా గా బాబు వర్గం వ్యవహరిస్తోంది.