వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది

రాష్ట్రంలో రాజకీయం మారుతుంది, నిన్నటి వరకు బలంగా కనిపించిన టిడిపి నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు వారంతా వైసీపీ వైపు తమ రాజకీయ పయనం సాగిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీలో వేడి బాగా రాజుకుంటోంది.

మన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ,నిన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, నేడు అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు రేపు మరొకరు ఇలా జోరుగా టిడిపి నుంచి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, ధీమాగాఓ వైపు అధికార టిడిపి చెబుతుంటే పరిస్థితులు మాత్రం వేరేగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా అధికార పార్టీలో చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా నాయకులు జోరు ను బట్టి తెలుస్తోంది.

ఐదేళ్ల పాలన తరువాత టిడిపికి ఎటు ప్రజావ్యతిరేకత ఉంటుంది కానీ ఓ రాజకీయ పార్టీ పట్ల పార్టీ నాయకుడి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేయడం అనేది ఇక్కడ విశేషం పరిణామం.

తన పాలన పట్ల జనం పూర్తి సంతృప్తి గా ఉండాలని ఓ వైపు అధినేత చంద్రబాబు చెబుతుంటే ఆయన పార్టీలో ఆయన నాయకత్వం కింద పని చేసిన నాయకులు వరుసగా ప్రత్యర్థి వైసీపీ వైపు గా చూడటం గమనించాల్సిన సంగతేన ని అంటున్నారు.

సాధనంగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా అయ్యా రామ్ గయారాం పార్టీలు మారడం మామూలుగానే ఉంటుంది.

అయితే ఇప్పుడు దానికి భిన్నంగా పెద్ద నాయకులు పార్టీని వీడడం అది కూడా టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు బయటకు వెళ్లడం అంటే పునాదులకే పగుళ్లు పడుతున్నాయా అన్న సందేహం కలుగుతుంది.

జాతీయ సర్వే లు అనేకం చెప్పడం కూడా వలసలకు కారణం అవుతుందని అంటున్నారు.

రవీంద్ర బాబు ఎస్సీ వర్గానికి చెందిన నేత టిడిపికి గుడ్బై చెప్పి వైసిపి లో చేరితే ,రాష్ట్రంలో సామాజిక సమీకరణలు అధికార పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా మారతాయి అన్న భావన బలపడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *