జగన్ 3 నెలల పాలన Vs బాబు పాలన కాలు తొక్కిననాడే కాపురం చేసే కల తెలుస్తుంది అంటారు

1.బాబు CM అయినాక జరిగిన మొదటి కలెక్టర్ల సదస్సులో మా కార్యకర్తలే మా విజయానికి కారణం కాబట్టి మా వాళ్ళను పట్టించుకోండి అని అన్నాడు బాబు

కానీ ఇందుకు విరుద్దంగా జగన్ CM అయినాక జరిగిన మొదటి కలెక్టర్ల సదస్సులో అవినీతిని హింస ను అరికట్టండి, మా నాయకులు తప్పు చేసినా శిక్షించండి అని చెప్పాడు.
అన్ని పార్టీల వారు మనకు సమానమే అని చెప్పాడు జగన్

మంత్రులు MLA లు ఎవరు అవినీతి చేసిన సహించను అన్ని గట్టిగా చెప్పాడు జగన్

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే బాబుకు 40 ప్లస్ యువకునికి ఎంత తేడా !!!

2.నాడు ప్రతిపక్ష నాయకుడు జగన్ లెగవగానే మైక్ కట్ చేయించి అచ్చి బుచ్చి గాలి ధూళి చేత తిట్టించేవాడు బాబు కానీ నేడు జగన్ ముందు బాబుకే మైక్ ఇవ్వండి ఎంత సేపు మాట్లాడుతాడో మాట్లాడనీయండి అన్ని అవకాశం ఇస్తున్నాడు జగన్

3.నాడు బాబు 23 మంది MLA లను కొని తన పార్టీ లో చేర్చుకొంటే నేను ఇతర పార్టీ MLA లను రాజీనామా చేయకుండా చేర్చుకొను అన్న జగన్ ఎక్కడ?

4.జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గీత ఖురాన్ బైబిల్ లాగా భావించి తన ఆఫీసులో పెట్టుకొని రోజూ గుర్తు చేసుకొంటూ ఆ హామీలను ఇప్పటికే దాదాపు 80 శాతం నెరవేర్చాడు కానీ బాబు తన ఎన్నికల మేనిఫెస్టో లు ఉన్న 640 హామీలను ప్రజలు ఎక్కడ అడుగుతారో అని ఇంటర్ నెట్ లో లేకుండా చేసాడు

5.ఏ పార్టీ వారికైనా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కాంట్రాక్టు లు మద్యం ఇసుక లాంటివే

బాబు హయాములో 36 మంది (అధికార) MLA లు ఇసుక దోపిడీ చేస్తున్నారు అని బాబు అను కుల పత్రిక ఈనాడు రాసింది

బాబుకు తెలీకుండా ఒక ఇసుక లారీ కూడా వెళ్లదు అని నటి మిత్రపక్షమైన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పాడు

అలాగే బాబు ఇంటి చుట్టూ పక్కల అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా జరిగింది, పర్యావరణానికి తీరని నష్టం అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు బాబు ప్రభుత్వానికి 100 కోట్ల ఫైన్ వేసారు.

అంటే బాబు హయాములో ఇసుకాసురులు ఎంతగా రెచ్చి పోయారో చోడండి

నా డాష్ బోర్డు లో నంద్యాల లో లైట్ వెలగకపోయినా తెలుస్తుంది చెప్పిన బాబుకు నిజ్జంగా ఇవి కనపడలేదా?

6.ఇక మధ్యం విషయానికి వద్దాం

సహజంగా మద్యం షాపులను అధికార పార్టీ వాళ్లే రింగ్ గా ఏర్పడి ఎక్కువగా దక్కించుకొంటారు అనేది జగమెరిగిన సత్యం.

కానీ బాబు హయం లో లాగా కాకుండా ప్రభుత్వమే మద్యం షాపులను నడపడం ద్వారా గత బాబు హయము లో ఉన్న షాపులకంటే వెయ్యి షాపులను తగ్గించి ((4 .380 నుంచి 3 ,500 కు మద్యం షాపులను తగ్గించారు) ,జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపు మద్యం షాపులు అనుమతించకపోవడం ,పాఠశాలలు, విద్యా సంస్ధలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల లోపు షాపులకు పర్మిషన్ ఇవ్వకపోవడం ,21 ఏళ్లు నిండని వారికి మద్యం అమకపోవడం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచడం , బెల్ట్ షాపు లు ఎత్తేయడం, తాగుడు మాన్పించేందుకు జిల్లాకో డీ–అడిక్షన్‌ సెంటర్‌ వంటి చర్యల ద్వారా మధ్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

తిరుపతి పవిత్రతను కాపాడే విధంగా తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రైల్వే స్టేషన్‌ నుంచి అలిపిరి వరకు వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్‌ సెంటర్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్‌ఆర్‌ ఆస్పత్రి, స్విమ్స్‌ రోడ్డులో మద్యం షాపుల ఏర్పాటుకు వీలు లేకుండా చేసారు జగన్

ఇక్కడ జగన్ కావాలనుకొంటే టీడీపీ హయాము లో లాగా వదిలేస్తే పార్టీ నాయకులే ఎక్కువ షాపులు దక్కించుకొని సంపాదించుకొనేవారు, కానీ జగన్ ఆ పని చేయడం లేదు

7.ఇక కాంట్రాక్టు ల విషయానికి వద్దాం

బాబు హయాములో చాలావరకు నామినేషన్ పద్ధతిలో ఇష్టం వచ్చినట్టు తనవారికి కాంట్రాక్టు వర్క్ లు ఇచ్చాడు

ఉదాహరణకు పోలవరం లో నవయుగ కంపెనీ కి 5 వేల కోట్ల పనులు( 1800 కోట్ల హెడ్ వర్క్స్ , 3200 కోట్ల జల విద్యుత్ పనులు ) టెండర్ లు పిలవకుండ్ నామినేషన్ పద్ధతిలో ఇచ్చాడు బాబు

100 కోట్లు దాటిన ఏ పని అయినా ఓపెన్ టెండర్ లు పిలిచి హై కోర్ట్ సూచించిన ఒక రిటైర్డ్ జడ్జి చేత టెండర్ ల నిభందనలు చూపించి పబ్లిక్ డొమైన్ లో ఒక 15 రోజులు పెట్టి ప్రజల నుంచి సూచనలు తీసుకొని ఫైనల్ గ టెండర్ నిభందనలు ఆ రిటైర్డ్ జడ్జి తయారు చేస్తారు. ఆ నిబంధనల మేరకు ఓపెన్ టెండర్ లో ఎవరైనా పాల్గొని కాంట్రాక్టు దక్కించుకోవచ్చు అని జగన్ ప్రభుత్వం చెబుతోంది, ఇది ఎంత పారదర్శకంగా నిజాయతీగా ఉంది.

ఇక టీడీపీ రాజ్యసభ MP CM రమేష్ కు టీడీపీ హయాములో లభించిన 3 వేల కోట్ల ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నామినేషన్ పద్ధతి లోనో, ఒక వలయంగా ఏర్పడి బెదిరించి వలన వచ్చినవే

మరి బాబుకు జగన్ కు అవినీతి అరికట్టే విషయం లో ఎంత తేడా

ఊరికే నేను నిప్పును వాచి ఉంగరం లేనోన్ని అని చెబితే సరిపోతుందా?

8.ఉద్యోగాలు

ఇంటికో ఉదోగం అని CM అయినా బాబు ఇంటిలో లోకేష్ కు మాత్రం మూడు మంత్రి పదవులు ఇచ్చాడు.
2 ,30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న కూడా భర్తీ చేయకుండా ఉద్యోగాలు ఇచ్చింది నామ మాత్రమే .

కానీ జగన్ గ్రామా సచివాలయం లో 1 ,33 , 494 శాశ్వత ఉద్యోగాలు మరియు 2 ,67 , 506 వలంటీర్ల ఉద్యోగాలు అంటే 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసాడు/చేస్తున్నాడు.

9.హామీలు
ఇక రైతులకు రైతు భరోసా కింద ఏటా 12 ,500 , పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా 15 వేలు ఇస్తున్నాడు జగన్

ఇలా ప్రధాన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్న జగన్ పట్ల బాబు అను కుల మీడియా గుర్రుగా ఉంది విషం చిమ్ముతోంది

10.రాష్ట్రం విడిపోయాక 13 జలాల AP కి లభించిన ఏకైక లాభం మిగులు విద్యుత్
మిగులు విద్యుత్ ఉన్నా అవసరం లేక పోయినా సగటున యూనిట్ కరెంటు 2 రూపాయలకే లభిస్తుంటే 4 -5 రూపాయలకు అది కూడా 25 సంవత్సరాలపాటు కొంటాను అని బాబు అను కుల కంపెనీ ల దగ్గర ఒప్పందం చేసుకోవడం వలన ఏటా 2 వేల కోట్ల నష్టం వస్తోంది కరెంటు డిస్కం లకు.

ఈ నేపధ్యం లో ఈ అనవసర ఒప్పందాలను పరిశీలించి కుదిరితే రేట్లు తగ్గించడం లేదంటే రద్దు చేయడమో చేసి రాష్ట్రాన్నిఅప్పుల పల నుంచి రక్షించాలి అని జగన్ భవిస్తుంటే ఎల్లో మీడియా తట్టుకోలేకతోంది.

11.రాష్ట్రానికి కేంద్రం నుంచి 70 వేల కోట్ల నిధులు రావాలి అని మాజీ IAS జయప్రకాశ్ నారాయణ కమిటీ చెబితే అవును కరెక్టు అని బాబు కు మద్దతుగా బీజేపీ ని దుమ్మెత్తిపోసిన ఇదే ఎల్లో మీడియా , ఇంకో తమిళనాడు IAS అధికారి శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ గుంటూరు జిలాలలో రాజధాని వద్దు అని చెప్పినా బాబు అక్కడే పెడితే తప్పుపట్టవు బాబును.

అలాగే బాబు హయాములో జరిగిన 11 వేల కోట్ల పోలవరం పనులలో జరిగిన అవినీతి పై ఇర్రిగేషన్ నిపుణుల కమిటీ దాదాపు 3 వేల కోట్ల అవినీతి జరిగింది .

నవయుగ కు నామినేషన్ పద్ధతిలో 5 వేల కోట్ల వర్క్ ఇవ్వడం తగదు అని చెబితే ఆ కమిటీ సూచనలను జగన్ పాటిస్తే తప్పు పడుతోంది ఎల్లో మీడియా

బాబు అను కుల ఎల్లో మీడియా కు నాడు బాబు ఏది చేసినా ముద్దు నేడు జగన్ ఏది చేసినా తప్పుగా కనపడుతోంది .

12.స్వాతంత్రం వచ్చాక అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పు దాదాపు లక్ష కోట్లు అయితే 2014 -19 మధ్య బాబు ఒకడే చేసిన అప్పు లక్ష 60 వేల కోట్లు
(2014 -15 లో 97 వేల కోట్లు ఉన్న అప్పు ఐదేళ్లలో 2 .58 లక్షల కోట్లకు చేరింది)

ఇవి కాకా వివిధ డిపార్ట్ మెంట్ లలో లక్ష కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి దిగిపోయాడు బాబు

లక్ష 60 వేల కోట్ల అప్పు చేసి 60 వేల కోట్ల పోలవరం కట్టాడా అంటే లేదు .పోనీ రాజధాని కట్టాడా అంటే లేదు మరి ఏమి చేసినట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు?

అయినా జగన్ నే తప్పుపడుతుంది ఎల్లో మీడియా

13.వరదల వలన, కొత్త ఇసుక పాలసీ వలన కొంత ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమే అయినా దాన్ని భూతద్దం లో చూపిస్తుంది ఎల్లో మీడియా. ఇంకో నెలలో ఇసుక సమస్య తీరుతుంది

తమ వర్గ ప్రయోజనాలు ఆర్ధిక ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారి దుష్ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా

ఇద్దరికీ ఎంత తేడా ?
నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *