నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్… విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం …

ఆగస్టు 15 నాటికి 4 లక్షల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు
ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా వితంతువులు, వృద్ధులు పింఛన్లను పెంచుతూ నూతన సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తొలి సంతకం ఈ ఫైలు మీదే జగన్ చేశారు.
1.నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్
2.విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం
3.హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు సీఎంగా జగన్ ప్రమాణం చేశారు.
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
అలాగే వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్‌తో ఇతర వైసీపీ ముఖ్య నేతలు వేదికపై కూర్చున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వీడ్కోలు పలికారు.
కాగా, స్టేడియంలోపలికి రాలేకపోయిన అభిమానులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా 14 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.
జగన్ సభాస్థలికి చేరుకున్న సమయంలో వైకాపా నేతలు హెలికాప్టర్ ద్వారా పూలు జల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
అంతకుముందు జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు.
మైదానంలో ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు జగన్ అభివాదం చేశారు.
✦ ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష చూపించినా, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అడిగినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పొచ్చని జగన్ ప్రజలకు సూచించారు. సీఎం ఆఫీసు నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.
✦ మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు.
అవినీతి లేని పాలన, వివక్షలేని పాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తామన్నారు.
✦ ఆగస్టు 15 నాటికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నూతన ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.
నాలుగు లక్షల గ్రామ వాలంటీర్లను నియమిస్తామని, ప్రభుత్వ పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరుస్తామని జగన్ చెప్పారు. ఒక్కో వాలంటీర్‌కు రూ.5 వేలు జీతం ఇస్తామన్నారు.
✦ ప్రస్తుతం అమలవుతోన్న పింఛన్లపై రూ.250 పెంచుతూ ఫైలుపై సీఎం జగన్ తొలి సంతకం చేశారు.
ఇక్కడి నుంచి సంవత్సరానికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని, తాము హామీ ఇచ్చిన ప్రకారం పింఛనును నాలుగేళ్లలో రూ.3000 చేస్తామని జగన్ పునరుద్ఘాటించారు. పెంచిన పింఛన్లు జూన్ 1 నుంచి అమలవుతాయన్నారు.
✦ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా వితంతువులు, వృద్ధులు పింఛన్లను పెంచుతూ నూతన సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
✦ కనీసం మూడు నాలుగు టెర్ములు సీఎంగా చేయాలి: కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్‌మోహన్ రెడ్డి గారికి నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల పక్షాన హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు.
తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదొక ఉజ్వలమైన ఘట్టం.
మీ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది. బాధ్యతను అద్భుతంగా నిర్వహించాలనే అభినివేశం, శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం మీకు ఉందని గత 9 సంవత్సరాలలో నిరూపించారు.
వయసు చిన్నదైన మీకు ఆ శక్తి తండ్రి నుంచి వచ్చిన వారసత్వం.
ఆ శక్తే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు.
దాన్ని సద్వినియోగం చేసుకుని నాన్నగారి పేరు నిలబెట్టి కనీసం మూడు నాలుగు టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తు్న్నాను.
డీఎంకే అధినేత స్టాలిన్ తెలుగులో మాట్లాడారు. అందరికీ నమస్కారం అని మొదలుపెట్టిన స్టాలిన్..
ఆ తరవాత తమిళంలో అందరికీ నమస్కారం చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుపరిపాలనను జగన్ కొనసాగిస్తారని తాను నమ్ముతున్నానని స్టాలిన్ అన్నారు.
జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
1.హిందూ వేద పండితులు వేద మంత్రాలతో జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వించారు.
2. సీఎం జగన్‌ను ముస్లిం మత పెద్దలు ఆశీర్వాదించారు. వేదికపై ప్రార్థనలు చేశారు.
3.జగన్‌ను క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వాదించారు. వేదికపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు4.ఏపీ నూతన సీఎం జగన్‌ను డీఎంకే అధినేత స్టాలిన్ శాలువా కప్పి సత్కరించారు.
5.జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ పుష్ఫ గుచ్ఛం అందజేశారు.
6.ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రధాన వేదికపై ఆసీనులైన ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, జగన్ తల్లి విజయమ్మ తదితరులు.
సీఎం జగన్ వరాలు: 4 లక్షల గ్రామ వాలంటీర్లు, గ్రామానికి 10 ఉద్యోగాలు…
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గ్రామ వాలంటీర్లను నియమిస్తామని చెప్పారు. మొత్తం 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కీలక ప్రకటనలు చేశారు. నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశం రాష్ట్రంలోని అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాజకీయాలు, పార్టీలు, కులాలు చూడకుండా.. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలని చెప్పారు.
ఈ దిశగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ వాలంటీర్లను నియమిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని జగన్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై రెండో సంతకం చేశారు.
గ్రామ వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున వేతనంగా చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పారు. సేవాభావం ఉన్న యువతీ యువకులను గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటామని ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని చెప్పారు.
తొలి సంతకం ఆ ఫైల్ పైనే..

‘ఆగస్టు 15 వరకు అక్షరాలా మన గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.
ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం.
గ్రామంలో చదువుకున్న, సేవాభావం ఉన్న యువతీ యువకులకు రూ. 5 వేల జీతం ఇస్తూ వాలంటీర్లుగా ప్రోత్సహిస్తం. వ్యవస్థలో లంచాలు లేకుండా చేస్తాం’ అని జగన్ చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, సేవలు ఏ ఒక్కరికీ అందకపోయినా, పథకాల అమల్లో అవినీతి చోటుచేసుకున్నా ఉపేక్షించబోనని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఆగస్టు 15న ఇందుకు సంబంధించి ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఫోన్ నంబర్ ఇస్తామని ప్రకటించారు.
అన్యాయం జరిగిందని భావించినవారు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
గ్రామ సచివాలయం ద్వారా ప్రతి గ్రామానికి 10 మందికి చొప్పున నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ చెప్పారు.
గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ.. ప్రతి గ్రామం నుంచి 10 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం లక్షా 60 వేల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యమని వెల్లడించారు.
గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో పని జరుగుతుందని స్పష్టం చేశారు.