యాత్ర వర్సెస్ కథానాయకుడు… పెద్ద తేడా అదే!

పేరుకి మాత్రమే యాత్ర సినిమా వైఎస్ఆర్ బయోపిక్.

వైసీపీ నేతలు కార్యకర్తలు ఎవరు విడుదలకు ముందు ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

పొలిటికల్ లాంచ్ లేకుండానే సినిమా నిర్మాణం పూర్తి అవడం విశేషం.

యాత్ర సినిమా ఫంక్షన్ కి రాజకీయ నాయకులు ఎవరూ కూడా హాజరు అవ్వలేదు.

జగన్ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా వేదికలపై మాట్లాడలేదు.

అయితే రెండు రోజుల్లో ఈ సీన్ మొత్తం రివర్స్ అయింది. యాత్ర మూవీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. వైసీపీ నేతలు కార్యకర్తలు సినిమాకు విపరీతమైన ప్రచారం చేశారు.

అన్ని జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళిపోయారు. కడప, కర్నూల్, నెల్లూరు జిల్లాలలో కోలాహలం గా మారింది ఈ యాత్ర సినిమా వల్ల.

ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు తన అనుచరులను కోసం థియేటర్లలోనే సీట్లను ముందుగా బుక్ చేయించుకున్నారు.

ఉదయం మొదటి ఆటతోనే యాత్రకు వైఎస్సార్ అభిమానులు క్యూ కట్టారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవు. యాత్ర థియేటర్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది.

వైసీపీ నేతలు సినిమాని ఓన్ చేసుకున్న… పార్టీలకు అతీతంగా ప్రజలు మొదటి రోజే సినిమా చూడటానికి మొగ్గు చూపారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ కి, వైయస్ఆర్ యాత్రకు తేడా తెలుసుకోవడం కోసం ఎక్కువమంది సినిమాని చూశారు.

ఎన్టీఆర్ కథానాయకుడితో ఏదీ మిస్ అయ్యిందో, యాత్ర సినిమాలో సరిగా అదే హిట్ అయింది.

అది ఎమోషన్, భావోద్వేగాలు పర్ఫెక్ట్ గా పండటమే యాత్ర సినిమాకు ప్లస్ అయింది అదే ఈ సినిమాకు హిట్ తెచ్చిపెట్టింది.

రెండు సినిమాల మధ్య ఇదే పెద్ద తేడా అంటున్నారు విశ్లేషకులు.

ఎన్టీఆర్ షూటింగ్ మొదలైనప్పటి నుండి టిడిపి నేతలు చేసిన పబ్లిసిటీ ఓవరాక్షన్ ఆ సినిమాకు మైనస్ కాగా,సినిమా విడుదల వరకు వైసిపి నేతలు పాటించిన సంయమనం యాత్రపై పొలిటికల్ రిమార్క్ లేకుండా చేసి ప్లస్ అయింది.

రిలీజ్ కు దగ్గర పడుతున్న తరుణంలో మాత్రమే నేతలు సందడి చేశారు.

విదేశాల్లో కూడా వైసీపీ అభిమానులు యాత్ర రిలీజ్ ను పండగ లా జరుపుకోవడం విశేషం. మొత్తానికి యాత్ర సినిమా వల్ల వైసీపీ నేతలలో జోష్ నింపిందని అనుకోవచ్చు.

టీడీపీ నేతలు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 ఫలితం ఎలా ఉంటుందో అని అయోమయ స్థితిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *