టిడిపి కి తలనొప్పిగా మారిన ‘యాత్ర సినిమా’ సక్సెస్…

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసి పెట్టిన అనేక కార్యక్రమాలను అడ్డం పెట్టుకుని ప్రచారం పొందుతుంది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటున్న చాలా పథకాలకు ఆద్యులు వైయస్ అని వేరే చెప్పక్కర్లేదు కదా.

ఈరోజు భారీ ఎత్తున పెన్షన్లను ఇస్తున్నట్లుగా బాబు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చినది 75 రూపాయల పెన్షన్ మాత్రమే.

అది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయోజితం.

ఊరికి ఐదారు మందిని ఎంపిక చేసి వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. ఎవరైనా చనిపోతేనే లిస్టు లో కొత్త వారి పేరును యాడ్ చేసి దుర్మార్గపు విధానాన్ని అమలు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఆ తీరును వైయస్ మార్చారు.

అధికారంలోకి వచ్చీ రాగానే…పెన్షన్లను, గృహ నిర్మాణాన్ని, రేషన్ కార్డులను, అడిగినవారికి అడగనివారికి కూడా ఇచ్చింది వైఎస్ ప్రభుత్వం మాత్రమే.

బాబు హయాంలో ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు.. అందరికీ ఇచ్చింది లేదు. ఆ లోటును పూర్తి చేసి కొత్త ట్రెండ్ సృష్టించారు. మన అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయనను రెండోసారి విజయం సాధించేలా గా చేసింది.

గతములో అనేక సమీకరణాలు మధ్యనం అధికారం సొంతం చేసుకున్నారు… చంద్రబాబు నాయుడు వైఎస్ పథకాలను కొనసాగిస్తూ వచ్చారు. వాటికి పచ్చ పేర్లను మాత్రం పెట్టుకున్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ ని ఎన్టీఆర్ వైద్య సేవ గా మార్చారు. ఇందిరమ్మ గృహ కల్పనకు ఇంకో పేరు పెట్టారు.108 కు మాత్రం పేరు మార్చలేకపోయారు.

ఇక ఈ రోజు చిత్తూరుకు నీళ్లు ఇచ్చామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం డబ్బు కొట్టు కుంటోంది. కియా పేరు చెప్పుకుంటోంది.

ఒకవేళ వై.యస్ చొరవ చూపించకపోతే ఉంటే, హాంద్రినీవా చిత్తూరు వరకు సాగేది కాదు. ఈ ప్రాజెక్టుకు వాటర్ సోర్స్ ఆధారంగా కియా పరిశ్రమ ఏర్పడిందే కాదు. ఇదంతా చరిత్ర, చెరిపితే చిరిగి పోయేది కాదు.

కాసేపు మరుగున పడి ఉండొచ్చు అంతే. ఇలాంటి మరుగునపడిన విషయాలను ఎవరో ఒకరు గుర్తు చేస్తూ ఉంటారు.

ఇప్పుడు ‘యాత్ర ‘సినిమా కూడా అలాగే ఉంది. వైయస్ మానన పుత్రికలు ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ఆలోచనల గురించి’ యాత్ర’ వివరిస్తోంది.

ప్రజలకు అత్యంత ఉపయోగపడే ఈ పథకాలు పితామహుడు వై ఎస్ ఆర్ అని ఘనంగా చెప్తుంది యాత్ర సినిమా.

ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కి ఇది తలకు భారం అయ్యే విషయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *