ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైకాపా అధినేత జగన్*

ఆంధ్రప్రదేశ్లో శాంతియుతoగా, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్రంలో. ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు.

బాధ్యతాయుతమైన ఆ స్థానాల్లో ఎవరినైనా నియమించి రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు జరుగుతున్నాయని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒకే సామాజిక వర్గం వారికి పదోన్నతులు ఇస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.

జగన్ తొ పాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిధున్రెడ్డి, వరప్రసాద్, ఉమ రెడ్డి వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్తో కలిసి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘo ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు వైకాపా అధినేత జగన్ వినతి పత్రం అందజేశారు.

జగన్ మీడియాతో మాట్లాడారు.” రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అనేది సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం.

రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట్లు ఉంటే, వాటిలో 59 18 లక్షల ఓట్లు నకిలీవే.

హైదరాబాదులో ను, ఏపీలోనూ నమోదైన ఓట్లు సుమారు 20 లక్షలు ఉన్నాయి.

ఒకే ఓటు రెండు సార్లు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ సీఈసీకీ ఇచ్చాం.

ప్రజా సాధికార సర్వే, రియల్ టైం గవర్నెన్స్, పరిష్కార వేదిక, పిరియాడిక్ సర్వే అంటూ సమాచారం సేకరించి వారి లో వైకాపా సానుభూతిపరులు ఉంటే వారి ఓట్లు తొలగిస్తున్నారు.

ఒక యాప్ ను సృష్టించి ఆధార్, వాటర్ కార్డ్లను అనుసంధానం చేసి మరి ఓట్లు తొలగిస్తున్నారు.

ఆ రకం గా తొలగించిన ఓట్లే నాలుగు లక్షలు ఉన్నాయని సీఈసీకీ చెప్పాం.

తాజాగా డీఎస్పీల పదోన్నతుల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన 35 మంది కిపదోన్నతి కల్పించారు.

లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అంటూ ఒక కొత్త పోస్ట్ సృష్టించి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్ ను ఆ పదవిలో నియమించారు.

వీరందరినీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియమించారని సీఈసీకీ చెప్పాం.

విశాఖలో నా పై హత్యాయత్నం జరిగినప్పుడు డిజిపి టాగూర్ ఏ విధంగా తప్పుదోవ పట్టించారు అనేది కూడాసీఈసీకీ వివరించ.

ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరావు, ఘట్టమనేని శ్రీనివాస్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. వారు విధుల్లో ఉంటే ఎన్నికలు శాంతియుతంగా జరగవు అని సీఈసీ కి చెప్పాo.

వీరి స్థానంలో వేరే ఎవరినైనా నియమించాలని కోరాo. ఏపీ సీఎం చంద్రబాబుకు బుద్ధి లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలన్నిటినీ గవర్నర్ ,కేంద్రం శాఖల దృష్టికి తీసుకెళ్తానని జగన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *