www.tdpmanifesto.com పేరు తో ప్రారంభం కానున్న టీడీపీ మేనిఫెస్టో వెబ్‌సైట్

ప్రజాభిప్రాయం కోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన టీడీపీ. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు, వివిధ వర్గాల అభిప్రాయాలు తెలియజేయవచ్చు.

ఆ మేరకు మేనిఫెస్టోపై ప్రజాభిప్రాయం తీసుకోవచు…మార్చి మొదటి వారానికి మేనిఫెస్టో సిద్ధం చేస్తామన్న కమిటీ.

అమరావతిలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చ ఈ నెల 25న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

ఎన్నికల సమరానికి సిద్ధమయ్యింది తెలుగుదేశం పార్టీ. నోటిఫికేషన్ కంటే ముందు మేనిఫెస్టో తుదిరూపు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యింది. సీనియర్ నేత, మంత్రి యమనల ఛైర్మన్‌గా కమిటీని కూడా నియమించారు.

ఈ కమిటీ బుధవారం అమరావతిలో సమావేశమై మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించింది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు తోడు కొత్తగా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను రూపొందించాలనే అంశాలపై దృష్టిపెట్టారు.

కమిటీ సమావేశం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 2019-24 ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రాథమికంగా చర్చించామని తెలిపారు. మేనిఫెస్టోలో సంక్షేమం, యువత, మహిళ, మధ్యతరగతి వర్గాలపై దృష్టి సారించామన్నారు.

కుటుంబ వికాసం కోసం మేనిఫెస్టోలో 15 అంశాలు.. సమాజ వికాస కోసం 10 అంశాలు చేరుస్తామన్నారు. ఈ నెల 25న మరోసారి కమిటీ సమావేశమవుతుందని.. 13 జిల్లాల పార్టీ నేతలతో చర్చించి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తామన్నారు.

మేనిఫెస్టో వెబ్‌సైట్

ప్రజాభిప్రాయం కోసం www.tdpmanifesto.com పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు అచ్చెన్న తెలిపారు.

ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు, వివిధ వర్గాల అభిప్రాయం తీసుకుంటామని.. మార్చి మొదటి వారానికి మేనిఫెస్టో రూపకల్పన పూర్తి చేస్తామన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మేనిఫెస్టోను అందిస్తామన్నారు.

వెబ్‌సైట్‌లో కూడా.. ‘తెలుగుదేశం 2014-19 మేనిఫెస్టోను ఎన్నో పథకాలు, కార్యక్రమాల రూపంలో అందజేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో దాదాపు అన్నీ అమలు చేశాం.

అదే స్ఫూర్తితో తెలుగుదేశం 2019-24 మేనిఫెస్టోను రూపొందిస్తున్నాం.. అందులో అత్యధిక ప్రజల అవసరాలు తీర్చే విధంగా, వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మీ విలువైన సూచనలను కోరుతున్నాము’ అంటూ ఆహ్వానం పలుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *