40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. టీడీపీ జెండా మళ్లీ ఏపీలో ఎగరబోతోందంటున్నారు చంద్రబాబు. .

టీడీపీ గెలుపు పక్కా.. మెజార్టీనే చూసుకోవాలి: చంద్రబాబు
40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. టీడీపీ జెండా మళ్లీ ఏపీలో ఎగరబోతోందంటున్నారు చంద్రబాబు. . గెలుపు ఖాయమయ్యిందని.. ఇక మెజార్టీనే చూసుకోవాలన్నారు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.
నూటికి వెయ్యిశాతం టీడీపీ గెలుస్తుందని ధీమా.
బూత్‌ల వారీగా ఎగ్జిట్‌ పోల్స్‌ తన దగ్గరున్నాయన్న బాబు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు అధినేత చంద్రబాబు. నూటికి వెయ్యిశాతం టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ నేతలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..

తాజా రాజకీయాలు, ఎన్నికలు, కౌంటింగ్‌ ప్రక్రియంకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు పలు సూచనలు చేశారు.

40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. టీడీపీ జెండా మళ్లీ ఏపీలో ఎగరబోతోందంటున్నారు చంద్రబాబు. తన దగ్గర చాలా సర్వే రిపోర్టులున్నాయని.. బూత్‌ల వారీగా ఎగ్జిట్‌ పోల్స్‌ తన వద్ద ఉన్నాయన్నారు.

గెలుపు ఖాయమయ్యిందని.. ఇక మెజార్టీనే చూసుకోవాలన్నారు. ప్రభుత్వం, పథకాలపై ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉంది.. వైసీపీ మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టాలన్నారు.

కౌంటింగ్‌ సమయంలో నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓడిపోతామన్న సీట్లలో కూడా మంచి ఆధిక్యత చూపాం.

ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కీలకమైనదంటున్నారు చంద్రబాబు. కౌంటింగ్‌కు ముందుగా ప్రిపరేషన్ కావాలని నేతలకు సూచించారు. ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్‌కు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. అనుభవం ఉన్నవాళ్లని ఎంపిక చేయాలన్నారు.

ఒక లాయర్, ఒక ఐటీ నిపుణుడు ఆ టీమ్‌లో ఉండాలన్నారు. పార్టీ నేతలకు కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్‌ రోజు వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *