నేను నా కుటుంబం వెంటే ఉంటాను: అని ప్రియాంక స్పష్టం చేశారు

కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ఇకనుంచి కీలకంగా వ్యవహరించనున్నారన్న ప్రకటన వచ్చి కొద్ది రోజులు అయింది.
కొద్ది రోజులలనే ఆమె భర్త రాబర్ట్ వాద్రా బుధవారం ఈడీ ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అతడిని ప్రియాంకనే స్వయంగా తన కారులో ఈడీ కార్యాలయం బయట దింపి, రాజకీయ విమర్శకులకు గట్టి సమాధానం పంపారు.
మీరు మీ కుటుంబాన్ని వదిలేస్తారా? నేను అలా వదలను. ‘నేను నా కుటుంబం వెంటే ఉంటాను’ అని ప్రియాంక స్పష్టం చేశారు.

సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ గతంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నా మొదటిసారి ఓ దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరయ్యారు.
భర్తను ఈడీ కార్యాలయం ఎదుట దింపిన అనంతరం ప్రియాంక నేరుగా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకొని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.
లండన్‌లో కొనుగోలు చేసిన స్థిరాస్తుల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ వాద్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
అయితే దానిపై ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దిల్లీ హైకోర్టు అంగీకరించి, ఈడీ విచారణకు హాజరుకావాలని సూచించింది.