బాలయ్య చిన్నల్లుడికి టికెట్ ఇస్తారా

హీరో బాలయ్య చిన్న అల్లుడు, విశాఖ తెలుగుదేశం నాయకుడు ఎమ్ వి వి ఎస్ మూర్తికి, అలాగే భాజపాలో వున్న కావూరి సాంబశివరావులకు మనవడు అయిన భరత్ కు విశాఖ ఎంపీ టికెట్ దొరకుతుందా? అన్నది అక్కడి రాజకీయ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ గావుంది.

కొద్ది రోజుల క్రితమే తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని, ఎంపీ సీట్ కు పోటీ చేస్తా అని భరత్ తనకు తానే ప్రకటించారు.

అయితే తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుందా? అన్నది అనుమానం.

బాలయ్యకు ఇచ్చి, ఆయన అల్లుళ్లు ఇద్దరు (లోకేష్, భరత్) లకు కూడా ఇస్తారా? ఆ విధంగా టోటల్ గా నాలుగు సీట్లు (బాబుతో కలిపి) ఒకే ఫ్యామిలీకి వెళ్లినట్లు అవుతుంది.

ఇదిలా వుంటే ఈ ఈక్వేషన్ సంగతి అలా వుంచితే, విశాఖ ఎంపీ సీట్ కు కొత్త అభ్యర్థిని దేశం అన్వేషిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

మంత్రి గంటా శ్రీనివాసరావును కానీ, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కూడా బరిలోకి దించాలని అధిష్టానం ఆలోచిస్తోందంటూ వార్తలు వినివస్తున్నాయి. చిరకాలంగా గంటాకు చంద్రబాబుకు మధ్య కాస్త అంతరం వుంటూ వస్తోంది.

కాక అయిదేళ్లు మంత్రిగా పనిచేసిన గంటా ను ఎంపీగా పంపితే ఎన్నికల ఖర్చు విషయంలో చూసుకోనక్కరలేదు. అలాగే సామాజిక ఈక్వేషన్ల రీత్యా పల్లా శ్రీనివాసరావు అయితే బాగుంటుందన్న డిస్కషన్లు కూడా వున్నాయి.

ఎలాగూ లోకేష్ డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ వుంది కాబట్టి, ఈసారి భరత్ ను ఎమ్మెల్సీకి పంపుకోవచ్చు.

మరి చంద్రబాబు ఫైనల్ నిర్ణయం ఏం తీసుకుంటారో మరి? వైకాపా తరపున ఇప్పటికి అయితే బిల్డర్ కమ్ సినిమా నిర్మాత ఎంవివి సత్యనారాయణ పేరు మాత్రమే వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *