రాజకీయాలు చేయను.. ఓన్లీ సినిమా అంటున్న కల్యాణ్ రామ్

ఏపీలో ఎన్నికలు దగ్గరకొచ్చాయి. ఈసారి నందమూరి కాంపౌండ్ నుంచి ఎవరు ప్రచారం చేయబోతున్నారు. బాలయ్యకు మద్దతుగా ఏ హీరో ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ మాత్రం క్లియర్ గా నో చెప్పేశాడు. తనకు రాజకీయాలకు ప్రస్తుతానికి దూరం అంటున్నాడు ఈ హీరో.

“ఎన్నికల కోసం బ్రేక్ తీసుకోవడం లేదు. నెక్ట్స్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాను. రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణం చేయను. రాజకీయాలతో నాకు సంబంధం ఉంది కానీ ప్రచారం మాత్రం చేయను.

ప్రచారంలో ఏం మాట్లాడాలో మనకు అవగాహన ఉండాలి కదా. ఆ అవగాహన నాకు లేదు. కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనను.”

118 మూవీ ప్రమోషన్ లో భాగంగా గ్రేట్ ఆంధ్ర కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు కల్యాణ్ రామ్. తను రాజకీయాల్లోకి వెళ్లడానికి చాలా టైమ్ ఉందంటున్నాడు.

ముందుగా సినిమాల్లో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని. ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రాలేదని, అలా హిట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అంటున్నాడు.

“ముందు నన్ను హిట్ సినిమా తీయనీయండి. ఒక హిట్ ఇస్తే, వెంటనే ఫ్లాప్ ఇస్తున్నాను. ఓ రెండు హిట్లు రానీయండి, ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుకుందాం.

” ఇలా రాజకీయాలపై తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు కల్యాణ్ రామ్.

118 సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న కల్యాణ్ రామ్, ఆ సినిమా సక్సెస్ బట్టి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెబుతానంటున్నాడు.

“ప్రస్తుతానికైతే రెండు కథలు విన్నాను. వాటికి ఓకే కూడా చెప్పాను.

పటాస్ టైపులో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న కథ కూడా విన్నాను. ప్రస్తుతానికైతే 118 కోసం ఎదురుచూస్తున్నాను.

ఈ సినిమా రిలీజ్ తర్వాత చెబుతాను. ఈ రెండింటిలో ఏది చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే చెబుతాను.”

తను చేసిన ప్రతి సినిమాను ఎన్టీఆర్ కు చూపిస్తానంటున్న కల్యాణ్ రామ్, నా నువ్వే సినిమాను మాత్రం తారక్ కు చూపించలేదంటున్నాడు.

ఎందుకో ఆ సినిమా చూపించాలని అనిపించలేదని, కానీ 118 మాత్రం చూపించానని అన్నాడు.

సినిమా చూసిన ఎన్టీఆర్, ఒక్క ఫ్రేమ్ కూడా తొలిగించకుండా సినిమా రిలీజ్ చేయాలని సూచించాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *