40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకి ఓటు ఎందుకు వేయకూడదో 40 కారణాలు

  1. ఓటుకు నోటు కేసు 👆💵 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పక్క పార్టీ MLAలను సంతలో పశువుల్లా కొని, నీచ రాజకీయాలకు తెరలేపిన ఈ కలియుగ శకునికి ప్రజలను పాలించే అర్హత లేదు.
  2. పోలవరం అవకతవకలు 🌊 పోలవరం ప్రాజెక్టును 2017 నాటికి పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు. అవినీతి, అవకతవకలు, ఆలస్యాలకు పర్యాయపదంగా ప్రాజెక్టును మార్చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్నికొండంతగా పెంచుతూ, గోరంత పనులు కూడా చేయలేదు.
  3. ప్రత్యేక హోదాతో వ్యాపారం
    💰 ఆంధ్రప్రదేశ్ కు సంజీవని లాంటి ప్రత్యేక హోదాను, ప్యాకేజి కోసం తాకట్టుపెట్టారు. పూటకో మాటతో ప్రత్యేక హోదా హక్కును అటకెక్కించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.
  4. ల్యాండ్ పూలింగ్ 🌏 రాజధాని పేరుతో రైతుల నుండి వేల ఎకరాల పంట భూములు లాక్కొని, వారి కడుపు కొట్టి, ఈరోజు ఆ భూములను ఎందుకూ పనికిరాని గొడ్ల సావిడిలా మార్చారు.
  5. రాజధాని నిర్మాణంలో అలసత్వం
    😴 రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చినా ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు. ఆ నిధులు ఎటు వెళ్లాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రపంచస్థాయి రాజధాని అంటూ ఇంకా డిజైన్ల పేర్లతో గ్రాఫిక్ సినిమా చూపిస్తున్నారు. అమరావతి ఇప్పుడు అంతుబట్టని మాయ.
  6. లెక్కకు మించి అప్పులు 💸
    అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కానీ రాష్ట్రం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపి తన ఆస్తులు పెంచుకుంటున్నాడు చంద్రబాబు.
  7. ఇంటికో ఉద్యోగం లేదు భ్రుతి లేదు 😣
    జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. జాబు లేకపోతే 2000 రూ. నిరుద్యోగ భ్రుతి ఇస్తా అన్నాడు. అబద్ధపు హామీలతో నిరుద్యోగుల ఓట్లు దండుకుని ఇప్పుడు వారి ఆత్మహత్యలకు కారణమయ్యాడు
  8. కుల రాజకీయాలు 😠 మ్యానిఫెస్టోలో కులానికి ఒక హామీ ఇచ్చి, ఏ ఒక్కటీ నెరవేర్చకుండా కులాల మధ్య చిచ్చుపెట్టి, ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ, అధికార మదంతో వెనుబడిన కులాల ప్రజలను అణగదొక్కుతున్నారు.
  9. మహిళలకు రక్షణ లేదు 😢 ఆయన వస్తే బాగుంటుంది అన్నాడు. ఆయన వచ్చాడు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా ఆడబిడ్డకు రక్షణ లేదు. మహిళలను వేధించిన కేసుల్లో అధికార పార్టీ నాయకులు ఉన్నా, వారిపై చర్యలు తీసుకోని అసమర్థ నాయకుడు.
  10. నేరాంధ్రప్రదేశ్ 😟 బాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ఘోరంగా ఉన్నాయని NCRB నివేదిక స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వానికి పట్టలేదు. మహిళలపై దాడులు ఆగలేదు.
  11. దళితులు, గిరిజనులపై దాడులు 😡
    దళితులు, గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక, వారి ఆస్తులను అక్రమంగా లాక్కొని, వారిపై దాడులకు తెగబడ్డ పచ్చ పార్టీ నాయకులు ఎందరో…
  12. ప్రకృతి వనరుల దోపిడి: 😤
    రాష్ట్రంలోని ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు యధేచ్ఛగా చెలరేగిపోతున్నాయి. అధికార బలంతో అడ్డ గోలుగా దోచుకుంటున్నారు ఈ పచ్చ నాయకులు
  13. డ్వాక్రా మహిళలకు మొండిచేయి: 👭
    డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో ఉన్న వారి బంగారం ఇంటికి తెస్తానని హామీ ఇచ్చాడు. కానీ వారిని నిలువునా మోసం చేసి, ఈనాడు అటు రుణమాఫీ చేయక ఇటు బంగారం విడిపించక, వేలం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు.
  14. మౌలికసదుపాయాలు శూన్యం: 🏙
    రోడ్లు, త్రాగు నీరు, వైద్యం లాంటి కనీస మౌలికసదుపాయాలు కూడా కల్పించక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బాబు ప్రభుత్వాన్నిఇంకా భరించాలా?
  15. రైతుల అత్మహత్యలు: 👨‍🌾😥 బేషరతుగా రుణమాఫీ చేస్తానని రైతన్నలను నమ్మించాడు. ఇప్పుడు అడిగితే పూర్తి రుణమాఫీ చేస్తానని నేను చెప్పినట్లు మీరు కలగన్నారా? రైతులకు అత్యాశ పనికిరాదు అంటూ హేళ చేశాడు. రుణమాఫీ చేయక రైతన్నలను అప్పుల ఊబిలో ముంచాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అప్పులు తీర్చలేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
  16. ఆరోగ్యశ్రీ & 108పై నిర్లక్ష్యం: 🚑😓
    పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికొదిలేసి, వారి చావులకు కారణమవ్వడమే కాక, అత్యవసర 108 సేవలపై కూడా నిర్వీర్యం చేస్తూ , ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు
  17. ప్రత్యేక రైల్వే జోన్ పై నిర్లక్ష్యం: 🛤🚆
    విభజన చట్టం హామీ అయిన విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాటం చేయక, కేంద్రానికి తొత్తులుగా మారి, రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు
  18. అతీ గతీలేని మెట్రో హామీ: 🚇
    అన్ని జిల్లాలను మేట్రోతో కలుపుతానని కపట హామీలిచ్చి, విజయవాడ మెట్రో ప్రారంభంలోనే ఎన్నో అవకతవకలకు, ఆలస్యాలకు కారణమయ్యారు. అయినా నాలుగేళ్ళు గడిచినా దుర్గమ్మ ఫ్లై ఓవర్ కట్టలేని వాడు మెట్రో కదతాడంట !
  19. టీడీపీ నాయకుల నేర చరిత్ర 🙆‍♂
    మహిళలపై దాడుల్లో ఐదుగురు టిడిపి నేతలపై పలు కేసులు ఉన్నాయని ఏకంగా ADR సంస్థనే నివేదిక ఇచ్చింది. సాక్ష్యత్తూ ప్రజా ప్రతినిధే ఒక ప్రభుత్వ అధికారిణినిని జుట్టు పట్టుకుని ఈడ్చినా కూడా చర్యలు తీసుకోని చంద్రబాబు మన ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం
  20. విలువలు లేని రాజకీయం
    స్వార్థ ప్రయోజనాల కోసం పొత్తులు, గెలవడం కోసం అబద్ధపు హామీలు, ప్రలోభాలతో నాయకులను కొనుగోలు చేయడం, నమ్మిన వారికి వెన్నుపోటు పొడవటం ఇదీ నలభై ఏళ్ళ చంద్రబాబు యొక్క విలువలు లేని నీచ రాజకీయ చరిత్ర.
  21. కాల్ మనీ సెక్స్ రాకెట్ 😧
    రాజధాని నడి బొడ్డున జరిగిన కాల్ మనీ సెక్స్ రాకెట్ ఉదంతం ప్రతి ఒక్కరి హృదయాలను కలచి వేసింది. ఎంతో మంది మహిళల జీవితాలను చీకటిలోకి తోసేసిన ఈ కాల రాక్షసులు అధికార పక్ష నేతలు అవ్వడం మన దౌర్భాగ్యం.
  22. అగ్రీగోల్డ్ స్కాం 😪
    దాదాపు ముప్ఫై లక్షల పేద, మధ్య తరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన భారీ స్కాం ఇది. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి అగ్రీగోల్డ్ అధిపతులతో చీకట్లో మంతనాలు జరిపుతూ ప్రజలకు ద్రోహం చేసిన నీచుడు చంద్రబాబు
  23. ప్రజాధనం వృధా 🤑
    సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేవు కానీ ప్రత్యేక విమానాల్లో వందల సార్లు విదేశాలు తిరగడానికి, ప్రచారాలకు, హంగు ఆర్భాటాలకు, దొంగ దీక్షలకు వందల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నాడు చంద్రబాబు.
  24. మద్యం ఏరులై పారిస్తున్నారు 🍺
    తాగడానికి మంచి నీళ్ళు దొరుకట్లేదు కానీ చంద్రబాబు పాలనలో మద్యం మాత్రం ఏరులై పారుతోంది. స్వయానా ముఖ్యమంత్రే రోజూ సాయంత్రం ఒక పెగ్గు వేసి పడుకోండి, అయ్యప్ప స్వామి మాలలు వేసి మద్యం తాగకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అనడం ఏమిటి ?
  25. కడప ఉక్కు కర్మాగారం 🏭👨‍🏭
    విభజన చట్టంలోని హామీల్లో ఇదీ ఒకటి. కడప జిల్లాకు ఉక్కు కర్మాగాం – వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగం. అన్ని సౌకర్యాలు ఉన్నా పరిశ్రమను తీసుకురాలేకపోవడం నేనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు అసమర్థతకు నిదర్శనం
  26. జన్మభూమి కమిటీలు 🧐
    దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్.. ఇందులో జరిగే అవినీతి అంతా ఇంతా కాదు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేయడం వీటి పని కానీ చేసేది ఏంటి అంటే ప్రతి
    పథకంలో పై నుంచి కింది వరకు ఎవరి స్థాయిలో వారు దోచుకోవడం. పథకాలు మాత్రం పచ్చ చొక్కాలకే వచ్చేలా చేయడం వీరు చేస్తున్నది.
  27. నీటి ప్రాజెక్టులు 🌊
    చంద్రబాబు పాలనలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అవ్వడం అంటే ఆకాశం భూమి కలవడం అన్నట్లు. అదీ జరగదు ఇదీ జరగదు.. పైగా ఇందులో జరిగే అవినీతి ఆ గంగమ్మకే ఎరుక. నీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ఏకంగా కాగ్ (CAG) సంస్థనే నివేదిక ఇచ్చింది.
  28. వెనుకబడిన వర్గాల సంక్షేమంలో వెనుకడుగు 🤷‍♂
    చంద్రబాబు – వెనుకబడిన వర్గాలు అసలు సంబంధం లేని రెండు పదాలు. వెనుకబడిన వారికి కార్పోరేషన్లు లేవు, ప్రత్యేక నిధుల కేటాయింపు లేదు, సంక్షేమ పథకాలు అసలు వారి ఇంటి గుమ్మం వరకు కూడా చేరవు. వెనుకబడిన వర్గాల జీవనాన్ని మెరుగు పర్చలేని ముఖ్యమంత్రి మనకెందుకు?
  29. తాగు నీటి కరువు 🚱
    ముఖ్యమంత్రి అంటే “హిమాలయా” నీళ్ళు 60రూపాయలు పెట్టి తాగడం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మందికి కనీస సదుపాయంగా తాగు నీరు అందివ్వడం. మంచి నీరు లేక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు కిడ్నీ తదితర వ్యాధులకు గురి కావడం జగమెరిగిన సత్యం. ఇక ప్రమాణ స్వీకారం చేసేప్పుడు పెట్టిన ఐదు సంతకాల్లో ఒకటి NTR సుజల స్రవంతి. ఈ పథకం అమలు అయ్యిందో లేదో పైన ఉన్న ఎన్.టీ.ఆర్ కే ఎరుక !
  30. వైద్యం – వైఫల్యం 🏥👎
    చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అనారోగ్యాంధ్ర ప్రదేశ్ అయ్యింది. ఆరోగ్యశ్రీతో కార్పోరేట్ వైద్యం లాంటివి దేవుడెరుగు కనీసం జ్వరాలు లాంటి చిన్న చిన్న జబ్బులను నయం చేయడానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు లేవు. ప్రసవం అయ్యి ఇంటికి వచ్చే లోపే ఎలుకల దాడికి పిల్లలు చనిపోవడం చూశాం, స్ట్రెచర్, వీల్ చైర్ లేక ఆస్పత్రి మెట్ల మీదనే ప్రాణాలు వదిలిన వృద్ధుడిని చూశాం, సలైన్ పెట్టడానికి కనీసం మంచాలు కూడా లేక సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టినట్లు సలైన్ పైపులను తగిలించుకుని కూర్చున్న గిరిజన విద్యార్థులను చూశాం. అమెరికా వాళ్ళు వచ్చి అమరావతిలో వైద్యం చేయించుకునేలా చేస్తాడంట ! ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరడం అంటే ఇదేనేమో !
  31. అక్రమ మైనింగ్ ⛔⛏
    బాబు పాలనలో శతకోటి స్కాముల్లో ఇదొకటి. అక్రమ మైనింగ్ తవ్వకాలలో వందల కోట్లు దండుకోవడం. కోర్టు నోటీసులు లెక్క చేయరు, అసలు దోషులకు శిక్ష పడదు. బొగ్గు నుంచి సున్నపు రాయి వరకు మైనింగ్ మొత్తం అక్రమమే ! గురజాలలో యరపతినేని చేస్తున్న అక్రమ మైనింగే దీనికి పెద్ద ఉదాహరణ.
  32. టీటీడీ ఉదంతం 😑
    ప్రాణాలతో ఉన్న మనుషులనే మోసం చేస్తున్న ఈ పచ్చ పార్టీకి కనిపించని దేవుడిని మోసం చేయడం ఒక లెక్కా ? విచిత్రం కాకపోతే దశాబ్ధాలుగా కొలువున్న దేవుడి నగలు మాయం అవ్వడం ఏంటి? వంట చేస్తుంటే ఆ వేడికి దేవుడి నగలు కరిగిపోయాయి అని ఒకరు, హుండీలో కాయిన్స్ కి వజ్రం పగిలిపోయింది అని ఒకరు.. ఏదీ నమ్మశక్యంగా లేదు.ఇక అదంతా ప్రశ్నించిన పూజార్లను విద్రోహులుగా మార్చి వారిని హింసించడం. దేవుడి నగలు ఏమయ్యాయో ఆ వెంకన్న చౌదరికే ఎరుక !
  33. ఫాతిమా విద్యార్థులు బలి 👨‍🎓😯
    వంద మంది వైద్య విద్యార్థులు భవిష్యత్తు బలి. కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీకి అన్ని అనుమతులు ఉన్నాయి అని కౌన్సిలింగ్ నిర్వహించి, డబ్బు కట్టించుకుని ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మీ సీట్లు చెల్లవు ఇది రూల్స్ కి వ్యతిరేకంగా ఉంది అని విద్యార్థులతో ఆడుకున్న వైనం. ఏడ్చి నిరసనలు చేపట్టి దీక్షలు చేసినా పట్టించుకోని చేతగాని ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు. వంద మంది విద్యార్థులకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా ?
  34. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం 🎒🏫
    పేదవాడికి ఉచిత విద్య ప్రధాన హక్కు. ఆ హక్కుని కాళ్ళతో తన్నాడు ఈ చంద్రబాబు. అవును తన మంత్రులకు మేలు చేసి లక్షల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను విర్వీర్యం చేశాడు. విద్య లేదు, టీచర్లు లేరు, సదుపాయాలు లేవు.. చంద్రబాబు చదివిన పాఠశాలనే దీన స్థితిలో ఉంది అంటే నమ్ముతారా ? కానీ ఇది సత్యం.
  35. అబద్ధపు హామీలు 🤥🤥
    21వ శతాబ్ధంలో అతి దారుణంగా మోసపోయింది ఎవరైనా ఉన్నారా అంటే అది ఏపీ ప్రజలే అని చెప్పుకోవచ్చు. ఒకటా రెండా 600 అబద్ధపు హామీలు నమ్మి ఓట్లు వేసి చంద్రబాబును గెలిపించి మరీ మోసపోయారు. ఆ హామీలు ఏంటో ఏపీలో చిన్న పిలాడి నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరిని అడిగినా చెప్తారు..
  36. వెన్నుపోటు 🔪👳‍♂
    వెన్నుపోటు అంటే చంద్రబాబు – చంద్రబాబు అంటే వెన్నుపోటు. మామ నుంచి ప్రజల దాకా అందర్నీ వెన్నుపోటు పొడిచాడు. ఎన్.టీ.ఆర్ కు వెన్నుపోటు పొడిచాడు, బావమరిది హరికృష్ణకు వెన్నుపోటు, జూనియర్ ఎన్.టీ.ఆర్ కు వెన్నుపోటు, చివరికి ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు
  37. యూ టర్న్ ⬆⬇
    చంద్రబాబు పుట్టాకే యూ టర్న్ అనే పదం పుట్టి ఉంటుందేమో. రుణమాఫీ నుంచి ప్రత్యేకహోదా వరకు, నోట్ల రద్దు నుంచి పార్టీలతో పొత్తు వరకు చంద్రబాబు మార్చిన మాటాలు అన్నీ ఇన్ని కావు. హోదా పదిహేనేళ్ళు కావాలని ఒకసారి, హోదా ఏమైనా సంజీవనా అని ఒకసారి, కోడలు మగపిల్లాడిని కంటా అంటే అత్త వద్దంటుందా అని ఒకసారి చివరికి హోదా కావాలని మళ్ళీ యూ టర్న్. నోట్ల రద్దు కూడా అంతే ప్రకటించగానే నా సలహానే అన్నాడు అది విఫలం అయ్యాక ముందు చూపు లేని కేంద్రం అన్నాడు. రోడ్లమీద యూ టర్న్ బోర్డు తీసి చంద్రబాబు పేరు పెడితే సరిపోతుంది..
  38. అన్నిట్లో అవినీతి 👊
    చరిత్రలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ని అవినీతిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు చంద్రబాబు. పంచ భూతాలలో అవినీతి చేయగల సమర్థులు ఈ పచ్చ పార్టీ వాళ్లు. మట్టి నుంచి తాత్కాలిక భవనాల నిర్మాణల వరకూ ఎక్కడ చూసినా అవినీతే. ఈ చంద్రబాబు పాలనలో అవినీతి జరగని రంగం ఏదైనా ఉందా ?
  39. అవకాశవాది 😩
    చంద్రబాబు లాంటి అవకాశవాద రాజకీయం ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఏ పార్టీకి ప్రజల్లో సానుభూతి ఉంటే సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ పార్టీతో పొత్తుకు ఎగబడుతాడు. తాను గెలవడానికి ఎన్ని నాటకాలు అయినా ఆడతాడు ఎంతమందిని అయినా తొక్కేస్తాడు. అబద్ధాలను నిజాలు అని నమ్మిస్తాడు.. నిజాలను అబద్ధాలుగా చిత్రీకరిస్తాడు
  40. మీడియా మరియు వ్యవస్థలను మేనేజ్ చేయడం 📰📺
    నిజాలను కప్పి పుచ్చి చంద్రబాబుకి అనుకూలంగా ప్రజలను మభ్య పెట్టడంలో ఎల్లో మీడియా పాత్ర అంతా ఇంతా కాదు. నాడు ఎన్.టీ.ఆర్ మీద దుష్ప్రచారం దగ్గర నుంచి నేటి వరకూ ఎల్లో మీడియా అండతోనే చంద్రబాబు అన్ని మోసాలు చేయగాలుగుతున్నాడు. సోషల్ మీడియా వచ్చాక ఈయనగారి నిజ స్వరూపం ప్రతి రోజూ బట్టబయలు అవుతోంది. సోషల్ మీడియా దాడి తట్టుకోలేక అధికార, అంగ బలంతో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, సోషల్ మీడియాలో వీడియోలు తొలగించడాలు చేస్తున్నారు. ఇక వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏకంగా జడ్జీలేకే విందు భోజనాలు ఇస్తాడు. ఒక్క కేసులో కూడా విచారణకు వెళ్ళకుండా 18కి పైగా స్టేలు తెచ్చుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబే !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *