రోజాకు ప్రత్యర్థి ఎవరు.. గాలి కుటుంబంలో చీలిక…

ఇటీవలే నగరి నియోజకవర్గంలో గ్రేట్ ఆంధ్ర నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్కేరోజా స్పష్టమైన లీడ్ లో ఉన్నారని తెలిసింది.. ఆ నియోజకవర్గంలో వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  53శాతం ఓట్లతో లీడ్ లో ఉండంగ.. తెలుగుదేశం పార్టీ 46 శాతం ఓట్లను పొందే పరిస్థితిలో ఉంది.

ఇదే పరిస్థితి కొనసాగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరిలో నుంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. 

మరోవైపు… నగరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా చిక్కుముడి వీడలేదు.

ఇక్కడ తెలుగుదేశం నేతగా వ్యవహరించిన గాలి ముద్దుకృష్ణమ మరణం తర్వాత ఆయన తనయుల్లో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. 

వారిద్దరిలో ఎవరికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలో చంద్రబాబే తేల్చుకోలేకపోయారు. చివరకు ముద్దుకృష్ణమ భార్యకు ఆ పదవిని ఇచ్చారు చంద్రబాబు.

గాలి కుటుంబంలో విబేధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన పెద్దకుమారుడు భాను ఒకవర్గం కాగా, చిన్న కుమారుడు జగదీష్- ముద్దుకృష్ణమ భార్య సరస్వతమ్మ మరో గ్రూప్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అశోక్ రాజుతో జగదీష్- సరస్వతమ్మలు చేతులు కలపడం విశేషం.

ఇక అశోక్ రాజు సామాజికవర్గానికే చెందిన వేరేవాళ్లు కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. 

తనకే టికెట్ దక్కుతుందని భాను ప్రకాష్ ప్రకటించుకుంటున్నారు. అశోక్ రాజు అభ్యర్థిత్వానికి సరస్వతమ్మ-జగదీష్ ల మద్దతు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరికొందరు ఔత్సాహికులు కూడా కుల సమీకరణాలతో టికెట్ ఆశిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఖరారు చేస్తారో వేచి చూడాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *