తండ్రీ కొడుకులు తప్ప ఇంక ఎవరు మాట్లాడలేరు… శవ రాజకీయాల పై‌…..

తండ్రి బాటలోనే తనయుడు కూడా నడుస్తున్నాడు…. ‘నేనే నిప్పు’ అంటూ ఇప్పటిదాకా చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారుగానీ, ఈ మధ్య ‘నేను కూడా నిప్పులాంటోడ్నే..’ అంటూ నారాలోకేష్‌ సొంతడబ్బా వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

విదేశాల్లో చదువుకున్న తాను, ఖరీదైన జీవితాన్ని వదిలేసుకుని.. కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటోన్న విషయం మనకు తెలిసిందే ‘మా తాత ముఖ్యమంత్రి.. మా నాన్న ముఖ్యమంత్రి..’ అంటూ అను నిత్యం నారాలోకేష్‌ సొంతడబ్బా కొట్టుకుంటోంటే తెలుగు తమ్ముళ్ళ చెవులకే చిల్లులు పడిపోతున్నాయ్‌ అట…

అసలు విషయం ఏమిటంటే

కొత్తగా చిన్న బాబు లోకేష్ సోషల్ మీడియాను ప్లాట్ ఫామ్ గా చేసుకుని శివ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.

గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల కోసం జరిగిన ఏర్పాట్లు లో ఓ రైతు ప్రాణాల్ని కోల్పోయాడు ఆ వార్త మనందరికీ తెలిసిందే… తన తండ్రి మరణానికి కారణం ప్రభుత్వమేనని మృతుడు కుమారుడు ఆరోపిస్తున్నాడు. దాంతో, సహజంగానే ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీయడానికి ప్రయత్నించింది. కానీ, చినబాబుకి ఇది ‘శవ రాజకీయం’లా కనిపిస్తోంది.

ఉత్సవాల ఏర్పాట్ల కోసం రైతు పొలం తీసుకున్న మాట నిజమేనని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆ రైతు అనుమతితోనే అతని స్థలం తీసుకున్నామన్నది పోలీసులు తాజాగా ఇచ్చిన వివరణ సమాచారం. కానీ, బాధిత కుటుంబం వాదన ఇంకోలా వుంది. కొండవీడు ప్రాంతంలోనే కాదు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఇప్పుడు ఈ అంశం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది.

‘రైతు ద్రోహి చంద్రబాబు’ అంటూ వైఎస్సార్సీపీ పెద్ద ఉద్యమానికే తెరలేపింది. ఈ మేరకు నిజ నిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఈ కమిటీ కోసం నియమించబడ్డారు కూడా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సింది పోయి, మంత్రి నారాలోకేష్‌ ‘శవ రాజకీయం’ అంటూ సింపుల్‌గా సోషల్‌ మీడియాలో స్టేట్‌మెంట్‌ ఇచ్చేయడం హాస్యాస్పదం గా మారింది.ఈ మేరకు నారాలోకేష్‌ ఓ వీడియో కూడా పోస్ట్‌ చేశారు, ‘శవ రాజకీయం’ అంటూ. అయితే, నెటిజన్లు మాత్రం లోకేష్ పై ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. ‘నువ్వు కూడా శవ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా.? మీ తాత స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిందెవరు.? ఆ తాత పేరు చెప్పుకుని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నదెవరు.?’ అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు.

ఈ మేరకు నారాలోకేష్‌ ఓ వీడియో కూడా పోస్ట్‌ చేశారు, ‘శవ రాజకీయం’ అంటూ. అయితే, నెటిజన్లు మాత్రం లోకేష్ పై ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. ‘నువ్వు కూడా శవ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా.? మీ తాత స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిందెవరు.? ఆ తాత పేరు చెప్పుకుని ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నదెవరు.?’ అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు.

టీడీపీ శవ రాజకీయాల గురించిన చరిత్రని తవ్వి తీస్తూ, చినబాబు పై నెటిజన్లు ఇస్తున్న కౌంటర్‌కి టిడిపి నేతల కు సమాధానం లేని పరిస్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *