నా దేశభక్తిని శంకించడానికి మీరెవరు? బీజేపీ నేతలపై పవన్ ఫైర్

ఆళ్లగడ్డలో తాను అన్న మాటలు పాకిస్థాన్‌ పత్రికల్లో వస్తాయని కలగనలేదని, వాటిని పట్టుకుని తన దేశభక్తిని శంకించడానికి మీరెవరంటూ బీజేపీ నేతలపై పవన్ విరుచుకుపడ్డారు.

  • 1.బీజేపీ నేతలపై జనసేనాని పవన్‌కళ్యాన్ మండిపడ్డారు.
  • 2.తన దేశభక్తిని శంకించడానికి మీరెవరంటూ ప్రశ్నించారు.
  • 3.దేశభక్తి బీజేపీ నేతలకు పేటెంట్ హక్కు కాదన్నారు.

పాకిస్థాన్‌తో యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల ముందే చెప్పారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీలు తనపై చేస్తున్న విమర్శలపై పవన్ తీవ్రంగా స్పందించారు.

చిత్తూరులో ఆదివారం జనసేన కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన బీజేపీ నేతలపై మండిపడ్డారు.

దేశభక్తిపై బీజేపీకి ఎవరూ పేటెంట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ సమావేశాల్లో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయని, భారత్ మాతాకీ జై అనే నినాదాలు వినిపిస్తాయని అన్నారు. తన దేశభక్తిని ఎవరి వద్దా నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఆళ్లగడ్డలో తాను అన్న మాటలు పాకిస్థాన్‌ పత్రికల్లో వస్తాయని కలగనలేదని, వాటిని పట్టుకుని తన దేశభక్తిని శంకించడానికి మీరెవరంటూ బీజేపీ నేతలపై పవన్ విరుచుకుపడ్డారు. ‘భాజపా నేత ఒకరు నా దేశభక్తిని శంకిస్తున్నారు.

ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొడితే కనీసం ఆగకుండా వెళ్లిపోయారు. మానవత్వం లేని అలాంటి వ్యక్తుల మాటలు పట్టించుకోనక్కర్లేదు’ అంటూ పరోక్షంగా భాజపా నేత జీవీఎల్‌ నరసింహారావునుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

‘‘తెలంగాణ రాష్ట్రం 1997లోనే వస్తుందని కొందరన్నారు. అంటే భవిష్యత్తు వారికి తెలుసనా? 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు, నేను కలిసి తిరుగ��
చంద్రబాబు, నేను కలిసి తిరుగుతున్నపుడు అవినీతి అంతం చేయాలంటే నోట్ల రద్దు అవసరమని అనుకున్నాం.

అంటే నోట్ల రద్దు గురించి మాకు ముందే తెలిసిపోయినట్లా?. అలాగే పాకిస్థాన్‌పై తాజాగా మెరుపు దాడుల విషయంలోనూ నేను గతంలో చెప్పిన మాటలను ఇప్పుడు వక్రీకరిస్తున్నారు.

నేను ఆనాడు విశ్లేషకుల అంచనాలనే నేను ప్రస్తావించాను. నేను మాట్లాడే మంచి మాటలను మీడియాలో చూపించరు. ఒక మాటపై వివాదం రేగితే మాత్రం పక్కదారి పట్టిస్తూ పదేపదే చూపిస్తారు. చర్చలు పెడతారు’ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *