ఎన్నికల సమీపిస్తున్న వేళ సొమ్ము ఎరజూపి మహిళా ఓటర్లను కొనుక్కుంటున్న బాబు…

CM Chandrababu to Announce MLA Candidates List for AP
ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేపని.. చాలామంది చేస్తున్న విమర్శ ఇది. ఇందులో సందేహం లేదు కూడా.
సరిగ్గా ఎన్నికల ముందు పెన్షన్ మొత్తాలను పెంచి, డ్వాక్రా మహిళలకు ఒక్కోరికి రెండు వేల రూపాయల చిల్లర మొత్తాన్ని ఇస్తూ.. వారి చేత తెలుగుదేశం పార్టీ కే ఓటు వేయాలని ఒట్టు పెట్టించుకుంటున్నారు.
ఈ డబ్బులు, చెక్కులు ఇచ్చే ప్రక్రియను తెలుగుదేశం వాళ్లు దగ్గరుండి చేస్తున్నారు. అంత మందిని ఒకేసారి కలవడం సాధ్యంకాదు కాబట్టి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, అనుచరులు.. వాటిని సదరు లబ్ధిదారులకు డైరెక్టుగా ఇస్తున్నారు. ఒట్టు పెట్టించుకోవడం, ప్రతిజ్ఞలు చేయించడం.. మాత్రం కామన్!
ఇదీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చేస్తున్న పని. దీని ప్రభావం ఎంత? అనేదే ఇప్పుడు పెద్ద చర్చ. రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షనర్లున్నారు. అంతకు మించి డ్వాక్రా మహిళలు ఉన్నారు.
ఈ వర్గాలను ఎన్నికల ముందు ఆకట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈ పని చేస్తున్నారనేది బహిరంగ సత్యం.
ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలున్నాయి. మొదటిది.. ఎన్నికల ముందు ఇలా చేతికి డబ్బులు ఇచ్చాడు కాబట్టి.. అధికారికంగా వీళ్ల ఓట్లను చంద్రబాబు నాయుడు కొనేశారు కాబట్టి… తిరిగి సైకిల్ గుర్తుకే ఓటు వేయడం.
రెండో అంశం.. ఇన్ని రోజులూ తమను నిర్లక్ష్యం చేసి.. కేవలం ఎన్నికలు వచ్చాయని, ప్రతిపక్ష నేత చెప్పారని.. ఈ హామీలను అమలు చేసేశారనే సూక్ష్మాన్ని జనాలు గ్రహించడం.

డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ.. రుణమాఫీ.
అది గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ. అమలు కాలేదు.
ఇలాంటి నేపథ్యంలో ఆ వర్గాలు అసహనంతో ఉన్నాయనే భావనతో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వాళ్లకు రెండువేల ఐదు వందల రూపాయలు చేతిలో పెడుతున్నారు.
ఇక పెన్షన్ కథ అందరికీ తెలిసిందే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ మొత్తాన్ని పెంచడం అనే హామీని ఇచ్చారు కాబట్టి..చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెన్షన్ మొత్తాలను పెంచారనే అంశమూ చాలామంది పెన్షనర్లకు తెలిసిన విషయమే.
పెన్షనర్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ఎత్తులను రెండేళ్ల కిందటే చెప్పారు.
పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని తను హామీ ఇచ్చా కాబట్టి.. బాబు పెంచుతారని.. ఆయన ఆ పని చేస్తే అంతకు మించి తను పెంచుతానని జగన్ అప్పుడే అన్నారు. జగన్ ఊహించిందే జరిగింది.
ఎన్నికలకు రెండు నెలల ముందు అది జరిగింది.
అందుకే పెన్షన్ మొత్తం మూడువేలు అని జగన్ హామీ ఇచ్చేశారు. మరి డ్వాక్రా మహిళలకూ జగన్ ఏదో ఒక హామీ ఇవ్వకుండా ఉండరు.
ఇలాంటి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు డిసైడింగ్ ఫ్యాక్టర్ స్థాయిలో ఉండబోయే పెన్షనర్లు, డ్వాక్రా మహిళలు ఎటు మొగ్గుతారో!