హోదా తాకట్టు దేనికోసం

1.అనుభవం పరిపాలన మీదా?లేక దోచుకోవడం, దాచుకోవడం మీద?

2.స్పెషల్ స్టేటస్ వస్తే ఎమోస్తాయో,మనకు లాభం ఎంతో తెలియకా?లేక తెలిసీ మోసమా?

3.హోదా వస్తే కంపెనీల కు,అలాగే ప్రజలకు లాభం..
దానివలన మనకేంటి లాభం?

హోదా వస్తే పలు కంపెనీల వారు వారంతట వారుగా భూమి కొనుగోలు చేసి, కంపెనీలు ఏర్పాటు చేసుకుని ,కేంద్రం ద్వారా గాని, రాష్ట్రం ద్వారా గాని వచ్చే టాక్స్ బెనిఫిట్స్ పొందుతూ కంపెనీలు నడపడం వలన మనకొచ్చే లాభం ఎంటనా?

అదే మనకు నచ్చిన,మన మాట విని, మనకు నచ్చిన రీతిలో లబ్ది చేకూర్చే వారికి వేల ఎకరాలు కట్టబెడితే వారిద్వారా మరింత అధిక మొత్తాన్ని దోచుకోవచ్చు అనా? హోదా అంటె చాలు ప్రజలను తప్పుదోవ పట్టించారు,జైలులో పెడతా అన్నారు,కేసులు కూడా పెట్టారు, సంజీవిని కాదు అన్నారు, ప్యాకేజి ముద్దు అన్నారు..దాని వలన అసలు లాభమే లేదన్నారు.ఇలా ఎన్నో చెప్పారు..ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీ లో తీర్మానం కూడా చేశారు…

మరల తిరిగి హోదా గురించి మీరు దీక్ష చేయడం ఏంటి? ఎవరిని మోసం చేయడానికి?

సార్ ఒక సందేహం…..ఎం ఎల్ సి లు అని ఎవరికోసం create చేశారు?

నాకు తెలిసి పార్టీలో అనుభవజ్ఞులై పోటీ చేయలేక పోయిన, పొరపాటున ఓడిపోయిన, లేక ఏదో ఒక శాఖలో అనుభవం ఉన్న వారిని ఎం ఎల్ సి లు గా తీసుకుని గవర్నమెంట్ కు ఉపయోగించుకోవాలి అని అర్థం అవునా?
మరి మీరు ఏమి అనుభవం ఉందని మీ కుమారుడుకు ఎం ఎల్ సి ఇచ్చి మినిస్టర్ ని చేయడం …అంటె మీ ద్వారా మీ కుమారుడు లబ్ది పొందడమే కదా? దీనిని ” క్విడ్ ప్రోకో ” అనరా సారూ?

సరే మీరు అనుభవజ్ఞులు కదా? వేరే పార్టీ ఎం ఎల్ ఏ లను కొనటం ఎందుకు సార్? పోనీ తీసుకోవటం ఎందుకు సార్?మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదా?

మీకు మీడియా ఉంది, ఇట్టే అబద్దాలు చెప్పి నమ్మించగలను అనే నమ్మకం ఉంది, అనుభవం కూడా ఉంది.

మీకున్న అనుభవం ఏమైంది సార్?650 హామీలు ఎలా ఇచ్చారు సార్?

మరి ఇప్పుడు ఎందుకు సార్ హామీలు కాపీ కొడుతున్నారు?ఇదొక కొత్త అనుభవమా సార్?

సార్ మీరు సి ఎమ్ గారు కదా సార్…మరి అందరినీ సమానంగా చూడాలి కదా సార్?
చిన్న కులస్తులు అంటె మీకు చిన్న చూపు ఉండకూడదు కదా సార్?
SC,ST లుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా?అని మీరు అనొచ్చా సార్?

అలాగే కోడలు అత్తగారు అనుకుంటూ జోకులు వేయకూడదు కదా సార్?

తప్పులు మీరు చేస్తూ, నేపాన్ని వేరే వాళ్ళ మీద నెట్టే తరుణం లో ప్రజలను తమ్ముళ్లు అంటూనే రెచ్చగొట్టడం, చేయకూడదు కదా సార్? ఇదేనా సార్ అనుభవం అంటే?

నాకు తెలిసి అనుభవం అంటే పరిపాలన తో ప్రజలను సంతోష పరచడం అవునా సార్?

మరి మీ అనుభవం ఎందులో సార్? ఇంత అనుభవం పెట్టుకుని దీక్షలు చేయడం ఏంటి సార్? అసహ్యంగా?అది కూడా పొత్తు పెట్టుకున్న పార్టీ మీద? మీ అనుభవం పని చేయలేదా సార్?

మరి ఇంకా అనుభవం, అనుభవం అంటారు ఎందుకు సార్?

నాకు తెలిసి నాయకునికి సబ్జెక్ట్ తెలిసి ఉండి,పట్టుదల, ప్రజలు అందరి పట్ల ఒకే భావన, సేవా దృక్పధం కలిగి ఉండాలి….

పట్టుదల లేని అనుభవం ఎందుకు ? దేనికి ఉపయోగం?

ఇనా మీ అనుభవం మిమ్మల్ని కాపాడుతోందిలే సార్…అదే సార్ ” స్టే ” లు……అవునా
మీరు సూపర్ సార్…..
ప్రజలను ఇట్టే పిచ్చోళ్ళను చేయగలరు…..

ఇంకో ముఖ్యమైన విషయం లో మీరు గ్రేట్ ..అదే సార్ మన పవన్ గారు….అబ్బా ఎంత చక్కగా మ్యానేజ్ చేస్తున్నారు సార్, మిమ్మల్ని విభేదిస్తున్నట్టు…మీరు సూపర్ సార్….

చూద్దాం మరి ఈ సారి ఎంతవరకు సక్సెస్ ఆవుతారో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *