సొమ్ము ఏమో మోడీది.. సోకు బాబు గారిది….

ఈ ఇద్దరు నేతలూ తమ జోబులో ఇంచి డబ్బులు తెచ్చివ్వడం లేదు కానీ.. ఎన్నికల ముందు వీరి గారడీలు మాత్రం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని అనౌన్స్ చేసింది సమాచారం.

అన్నాదాత సుఖీభవ అంటూ.. పథకాన్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించేసింది. అదేంటో చంద్రబాబుకు ఎన్నికలు వస్తే కానీ.. డ్వాక్రా మహిళలు, పెన్షనర్లు, రైతులు గుర్తుకి రారు మరి.

ఇప్పుడు డైరెక్టుగా వారి ఖాతాల్లోకి డబ్బులు వేసే ప్రక్రియను చేపట్టారు. ఓటు రేటుకు తగ్గట్టుగా డబ్బులు వేస్తున్నట్టుగా ఉన్నారు.

పెట్టుబడికి సాయం.. అందిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే ఇది ప్రతిపక్ష పార్టీ నవరత్నాల నుంచి కాపీకొట్టిన పథకమే, తెలంగాణలో ఎప్పటినుంచో అమల్లో ఉన్న పథకమే ఇది…

ఎన్నికల సమయంలో వీటిని అమలు చేసేసినట్టుగా అనిపించేసి ఓట్లను కొల్లగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.

ఇక్కడ మరో కామెడీ విషయం ఏమిటంటే.. ఒక్కో రైతుకూ పెట్టుబడి సాయం కింద పది వేల రూపాయలు అని.. అది రెండు విడతలుగా అని ప్రకటించారు. మరి ఈ సాయం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచినా అంటే.. అదేం లేదు.

ఇటీవలే కేంద్ర బడ్జెట్ లో రైతులకు ఆరువేల రూపాయలు అని ఒక పథకాన్ని ప్రకటించారు కదా.. దానితో ఏపీ ప్రభుత్వం మమేకం అవుతుందట!

ఒకవైపు మోడీ రాష్ట్రానికి సాయం చేయడంలేదు అంటున్నారు.. మళ్లీ ఇప్పుడేమో కేంద్రం ఆరువేలు ఇస్తానని అంటోంది కదా.. దానికి నాలుగువేలు జతచేస్తామని చెబుతున్నారు. మొత్తం పదివేల రూపాయల సాయం అని ప్రకటించుకుంటున్నారు.

తామేదో పదివేల రూపాయలు వేస్తున్నట్టుగా ప్రకటించుకుందున్నారు. కేంద్రం ఇస్తున్న ఆరువేలకు తోడు.. అని కండీషన్స్ చిన్నగా చెబుతున్నారు. మరి దీన్ని ఏమనాలి? ఒకవైపు మోడీని తిడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.

మళ్లీ మోడీ ఇస్తున్న మొత్తానికి వీళ్లు ఇస్తామంటున్న మొత్తాన్ని కూడి.. అంతా తమ ఖాతాలోకి క్రెడిట్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.చంద్రబాబు ట్రిక్కులు మామూలుగా లేవు గా!

అయితే ఎన్నికలు వస్తే కానీ.. తాము గుర్తుకురావడం లేదని ప్రజలు గుర్తిస్తే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి చూడాలి మరి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *