యుద్ధం వస్తే.. భారత్ సైనిక శక్తి ఎంత? పాక్ బలమెంత?

పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. మన దగ్గరున్న సైనిక బలం ఎంత? ప్రత్యర్థి సైనిక శక్తి ఎంత? ఇరు దేశాల బలాబలాలు ఇలా ఉన్నాయి. మన సైనిక సంపత్తి ముందు పాక్ సైనిక శక్తి చాలా తక్కువ.

పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. మన దగ్గరున్న సైనిక బలం ఎంత?ప్రత్యర్థి సైనిక శక్తి ఎంత? ఇరు దేశాల బలాబలాలు ఇలా ఉన్నాయి.మన సైనిక సంపత్తి ముందు పాక్ సైనిక శక్తి చాలా తక్కువ.

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. దీంతో పాకిస్థాన్‌ను ఏకాకి చేయాలని భారత్ నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. భారత్‌పై మాటల దాడి ప్రారంభించింది.

దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. గతంలో భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధాల్లో మనదే పైచేయిగా నిలిచింది.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో మరోసారి యుద్ధం వస్తే.. మన సైనిక బలం ముందు పాక్ తీసికట్టే. రెండు దేశాల సైనిక బలాబలాల వివరాలు..

2018లో భారత్ సైన్యానికి రూ.4 కోట్లను (58 బిలియన్ డాలర్లు) కేటాయించగా.. పాక్ 11 బిలియన్ డాలర్లను కేటయించింది.

భారత్ దగ్గర 5000 కి.మీ. లక్ష్యాలను చేధించగల అగ్ని క్షిపణులు ఉన్నాయి. పాకిస్థాన్ దగ్గర 2500 కి.మీ. దూరాన్ని చేరగల షహీన్ క్షిపణులున్నాయి.

పాకిస్థాన్ దగ్గర 140-150 అణ్వాయుధాలు ఉండగా.. భారత్ దగ్గర 130-140 న్యూక్లియర్ వార్‌హెడ్లు ఉన్నాయి.

మన సైన్యం 13 లక్షలు కాగా.. పాకిస్థాన్ సైన్యం 6 లక్షలు మాత్రమే. ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్‌లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు.. ఇలా ఏ రకంగా చూసినా భారత్ దగ్గరున్న ఆయుధ సంపత్తే ఎక్కువ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *