‘మళ్లీ మనమే రావాలి’ అంటూ సభలో పెద్దగా నినాదలు చేసినందున… ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

సభ వాయిదాకు ముందు టీడీపీ సభ్యులు హర్షద్వానాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

‘మళ్లీ మనమే రావాలి’ అంటూ సభలో పెద్దగా నినాదాలు చేశారు. అసెంబ్లీ అంటేనే ఉగాది పచ్చడిలా ఉంటుందన్న స్పీకర్ కోడెల.

మొత్తం 38 గంటల 13 నిమిషాలు పాటూ జరిగిన సభఆరు రోజుల పాటూ జరిగిన సభలో 20 బిల్లులకు ఆమోదంస్పీకర్‌గా అవకావం రావడం గొప్ప విషయమన్న స్పీకర్ కోడెల.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి సమావేశాలు ముగిశాయి. జనవరి 30న ప్రారంభమైన సమావేశాలు.. మొత్తం ఆరు రోజుల పాటూ కొనసాగాయి.

మొత్తం 38 గంటల 13 నిమిషాలు పాటూ జరిగిన సభలో.. 20 బిల్లులకు ఆమోదం తెలిపారు. ముఖ్యమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 5న ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. సభ వాయిదాకు ముందు టీడీపీ సభ్యులు హర్షద్వానాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
‘మళ్లీ మనమే రావాలి’ అంటూ నినాదాలు చేశారు.

విభజన తర్వాత ఏర్పాటైన తొలి శాసనసభకు సభాపతిగా వ్యవహరించడం ఎంతో సంతోషాన్ని మిగిల్చిందని కోడెల శివప్రసాదరావు అన్నారు.

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సభాధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, సభ్యుల సహకారంతో.. అసెంబ్లీని హుందాగా నడుపుకున్నామన్నారు.

అసెంబ్లీ అంటేనే ఉగాది పచ్చడిలా ఉంటుందంటూ స్పీకర్ ఛమత్కరించారు.
అంతకు ముందు సభలో ఓటాన్ బడ్జెట్‌పై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించామన్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటూ ఇవ్వనివి కూడా అమలు చేశామని చెప్పారు. రైతులకు రూ.1.5 లక్షలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.

బీసీలకు సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చి.. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించామన్నారు. అలాగే అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు.. ప్రభుత్వ, ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం.. వృద్ధులు, వితంతువులను ఆదుకున్నామన్నారు.

ఆటోలపై జీవితకాలపు పన్ను, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను మినహాయించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed