ఓవర్ నైట్ నేతలతో వైకాపాకు చేటు…

గుడ్ నైట్ పుట్టుకొస్తున్న కొందరు నేతలతో కొంప ముంచే పరిస్థితి వాటిల్లుతోందని వైకాపా శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు.

కొంతమంది ఇంటి దొంగల తో జగన్ పార్టీ కి చేటు కలిగే పరిస్థితిని దాపురించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో చట్ట సభలకు ఎన్నిక కావాల్సిన వారు కేవలం ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు వచ్చిన వారే కాకుండా ప్రజలు మెచ్చే వారు అయి ఉండాలన్నది ప్రాథమిక సూత్రం.

అయితే ప్రజలతో సంబంధం లేనప్పటికీ పార్టీలలోని నిర్ణయాత్మక శక్తులను ఏదో విధిగా ప్రసన్నం చేసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నా వారు వైకాపాలో తయారయ్యారు.

అలాంటి ఓవర్ నైట్ నాయకులు ఎక్కువగా కొత్తగా ఊపిరి పోసుకున్న పార్టీలోనే కనిపించడం సహజం.

అయితే వైకాపా ఆవిర్భవించి 8 ఏళ్లు దాటిన ఈ తరహా పోకడలు కనిపిస్తూ ఉండటం పార్టీకి చేస్తున్నాయని అనుకోవచ్చు.

తూర్పుగోదావరి జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

ముఖ్యంగా బీసీ వర్గాల నుండి ఈ విధంగా కొత్తముఖాలు పుట్టుక రావడంతో పార్టీ ప్రారంభం నుండి ఉన్న నాయకులకు శిరోభారంగా మారింది.

ఈ కారణాలతో పార్టీ శ్రేణులు డీలా పడుతున్నారు. సాధారణంగా ఈ తరహాలో కొత్త నాయకులకు ప్రజలతో పంత మాత్రం సంబంధం ఉండదని నిర్వ వారికి కిందిస్థాయి కార్యకర్తల తో కూడా వీరికి సన్నిహిత సంబంధాలు ఉండవు.

అటువంటి అభ్యర్థుల పట్ల విధేయత, శ్రద్ధతో పార్టీ కేడర్ పని చేయకపోవడంతో జనంలో ఉండే ఆదరణకు ఓట్ల రూపంలో పొందలేక పార్టీ పరాజయం పాలవ్వడం తప్పదు.

పార్టీ సర్వేలలో సదరు నేతలు ఆధిక్యత చాటుకున్న ఇటువంటి స్థానిక అంశాలు కారణంగా చతికిల పడటం 2014 ఎన్నికల్లో పార్టీ చవిచూసింది.

నిజానికి 2014లో గెలిచే అవకాశాలు లేవని తెలిసినప్పటికీ కొందరు సీనియర్ నాయకులు వివిధ మొహమాటాలు, ఒత్తిళ్ల కారణంగా జగన్ అవకాశం కల్పించారు.

ఇటువంటి గుదిబండల కారణంగా పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

జిల్లాలోని రామచంద్రాపురం, మండపేట తదితర నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు దాపరిచినట్లు శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు.

ముఖ్యంగా ఆయా నియోజకవర్గాలలో కన్వీనర్ ల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో నాయకత్వ మార్పిడి అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇదే అదునుగా ఓ మహిళ గతంలో పార్టీతో ఏ విధమైన సంబంధం లేనప్పటికీ టికెట్ కోసం తెరచాటు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు జగన్ కు సన్నిహితుడైన ఓ వ్యక్తి ద్వారా టిక్కెట్ కోసం ప్రయత్నాలు జరిపినట్లు సమాచారం.

వైకాపా ఆవిర్భావం నుండి రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంతో కృషిచేసిన డాక్టర్ దంపతులకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా చేయడంలో స్థానిక ఎమ్మెల్సీ, కోఆర్డినేటర్లు శాయశక్తుల కృషి చేసినట్లు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

అయినప్పటికీ జగన్ విజ్ఞతతో ఈ అంశాన్ని పరిగణంలోకి తీసుకుంటున్నారన్న ఆశాభావంతో ఉంది. మండపేట నియోజకవర్గానికి పార్టీ బాధ్యుడిగా నియమితులైన పీఠాన్ని అన్నవరం పై స్థానికేతరుడన్న ముద్ర కూడా ఉంది.

మండపేటలో కమ్మ సామాజిక వర్గానికి తిరుగులేని పట్టు ఉన్నప్పటికీ వేరే సామాజిక వర్గానికి చెందిన అన్నవరం స్థానికేతరుడు కూడా కావడంతో ఇక్కడ వైకాపాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

ఇదేవిధంగా స్థానికేతరుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారన్న కారణంతో మండపేట నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

రాజకీయాలకు కొత్త, స్థానికేతరుడైన అన్నవరం సైతం అదే రీతిలో దెబ్బతినే అవకాశముందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *