ఓటుకు నోటు కేసుపై…. రేవంత్ రెడ్డిని సూటిగా విచారించిన ఈడీ…..

ఈడీ రేవంత్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది….ఓటుకు నోటు కేసులో కోని విషయంలో ఆరా తీశారు .బాధ్యత గల పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యానని రేవంత్ తెలిపారు. ఏసీబీ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం.

ఓటుకు నోటు కేసులో ఈడీ రేవంత్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు…ఏసీబీ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈడీ మంగళవారం 8 గంటలపాటు విచారించింది.

బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. మధ్యాహ్నం అరగంట సేపు భోజన విరామం ఇచ్చిన ఈడీ అధికారులు అనంతరం మళ్లీ రేవంత్‌ను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఈడీ గతవారం వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయుడు ని ప్రశ్నించారు

ఏసీబీ ఛార్జీషీట్ ఆధారంగా ఈడీ అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా…

రూ.50 లక్షలు రుపయలు స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు ఎక్కడివని ఈడీ ఆరా తీసింది. వేం నరేందర్ రెడ్డిని కూడా ఈ డబ్బు విషయమై ఈడీ ప్రశ్నించింది.

బాధ్యత గల పౌరుడిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ విచారణకు హాజరయ్యానని రేవంత్ రెడ్డితెలిపారు. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆయన తెలిపారు.

ఎన్నికల సమయంలో నాపై నమోదైన కేసులను ఈడీ విచారించిందన్న ఆయన.. రేపు ఈ విచారణ వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హస్తం ఉన్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *