విశాఖ రైల్వే జోన్ తొ మన రైల్వేకు మహర్దశ

నవ్యాంధ్ర ఏర్పడ్డాక రాష్ట్ర ప్రజల ప్రధాన డిమాండ్లు ఒకటేనా విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది.

“సౌత్ కోస్ట్ రైల్వే” పేరుతో ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తూ రైల్వేమంత్రి అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రత్యేక డివిజన్లుగా ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లో విశాఖలో విలీనం కానుండగా ఈ పరిధిలో ఉన్న జిల్లాలోని రైల్వే స్టేషన్ పరిధి ఇకపై విశాఖ జోన్ గా రూపాంతరం చెందనుoది.

జిల్లా పరిధిలోని పలు రైల్వేస్టేషన్లు తోపాటు ప్రాజెక్టులు, ఇతర అంశాల పరంగా ఆదాయం పెరగనుంది.

ముఖ్యంగా జిల్లాల్లో దాదాపు అదనపు లైన్లు వస్తాయి, అదనపు ఆదాయం సమకూరుతుంది.

ప్రయాణానికి కొత్తగా రైళ్లు వచ్చే అవకాశం ఉంది ,జిల్లాల్లో రోజు వారిగ లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా ఎక్కువగా విజయవాడ, చెన్నై, తిరుపతి తదితరులకు వెళ్తుంటారు.

అదనంగా రైళ్లు రానుండడంతో ప్రయాణికుల వేతలు కొంత తీరినట్లే, స్థానిక ఆదాయం నిధుల కొరత కారణంగా జిల్లా కేంద్రం ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్ లో ఇప్పటికీ పలు సౌకర్యాల కొరత వేధిస్తోంది.

తాజా నిర్ణయంతో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

రైల్వే స్టేషన్లలో సిబ్బంది కొరత తీరడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

మనకు వాటా, ఏపీలో అత్యధిక శాతం ఆదాయం సమకూర్చే జిల్లాగా విశాఖ ఉండగా ఇక్కడ పోర్టు, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం ప్రస్తుతం విశాఖ జోన్ లో కలిపిన మిగతా ప్రాంతాలకు సమకూరుతుంది.

జోన్ కు వచ్చే ఆదాయం 40 శాతం డివిజన్లకు, జిల్లాలకు ఇస్తారు. దీంతో పాటు జిల్లాలోని సరుకు ,రవాణాకు ఉతo కానుంది.

కొత్త ప్రాజెక్టులు సహకారం అయ్యే పరిస్థితుల్లో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. సరుకు రవాణాకు విశాఖ ,చెన్నైకి మధ్య మూడో లైను ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో కార్యరూపo దాల్చే అవకాశాలు మెరుగవుతాయి.

వీలైతే ఈ మార్గంలోని మిగతా రైల్వే స్టేషన్ తో పాటు చీరాల ,ఒంగోలు రైల్వే స్టేషన్ కు మహర్దశ రానుంది.

ఇప్పటికే ఇక్కడ ప్రాచుర్యం పొందిన పొగాకు, గ్రైనేట్, ఉలవపాడు ,మామిడి, మార్కాపురం పలకలు ,వేటపాలెం జీడిపప్పు తదితర ఉత్పత్తుల ఎగుమతులకు మరింత ఊపునిస్తుంది.

అటు విశాఖ, టు చెన్నై ప్రాంతాలకు సులువుగా చేరుతాయి, జిల్లా మీదుగా అదనంగా రైలు రానున్నాయి.

విశాఖపట్నం నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకంగా సమకూరనునయి ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *