ప్రేక్షక హృదయాల పై పరుగులు తీస్తున్న యాత్ర సినిమా పై విజయమ్మ స్పందన*

బయోపిక్ ల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధతొ వచ్చిన సినిమా యాత్ర.
మహి వి రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాను విజయ్ జిల్లా శశిధర్ రెడ్డి నిర్మించారు.
ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించిన యాత్ర సినిమా శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది.
మరోసారి తెర మీద వైయస్ రాజశేఖర్ రెడ్డి చూసినట్టుగా ఉందని అందరూ అంటున్నారు.
వైయస్ రాజశేఖర్రెడ్డి ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారని మరోసారి ఈ సినిమా విజయం చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా చూసిన వైయస్ సతీమణి విజయమ్మ ఏలాస్పందించారంటే, వైయస్ జాయపకాలను తట్టిలేపారు.
కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన వైయస్ జ్ఞాపకాలను మరోసారి నిద్రలేపారు అని, వైయస్ మన ముందు లేకునా ఆయనను మనం ముందుకు తెచ్చారు దర్శక నిర్మాతలు.
ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రతి నిమిషం ఆలోచించేవారు.
వైయస్ను ఆదరించినట్లుగానే ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
విజయమ్మ మాట్లాడుతూ దర్శకుడు మహి వి రాఘవ్ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు, సినిమా మంచి ఎమోషనల్ జర్నీ లా సాగింది .
యాత్ర వసూళ్ల పరంగా కూడా అదరగొడుతుంది అని అన్నారు.
డిజిటల్ రైట్స్ ఇప్పటికీ 8కోట్లు వసూలు చేయగా శాటిలైట్ రైట్స్ లెక్క తెలియాల్సి ఉంది.
సినిమాల్లో ముమ్ముట్టి నటనకు అందరూ పిదా అవుతున్నారు. ఆయన నటన కాబట్టి ఈ సినిమాకు పూర్తి న్యాయం జరిగిందని చెబుతున్నారు, మరోసారి తన నటనా ప్రతిభతో ఆడియన్స్ ని మెప్పించారు మమ్ముట్టి.