ప్రముఖ దర్శకుడు విజయ్ బాపినీడు కన్నుమూత…

చిరంజీవికి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో అనారోగ్యము తో బాధపడుతూ తన తుది శ్వాస విడిచారు.

విజయబాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి .. 1936లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించారు.

చిరంజీవితో గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786 సహా కలిసి చిత్రాలకు దర్శకత్వం వహించారు బాపినీడు.

కొంతకాలముగా బాపినీడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఏలూరు సి ఆర్ ఆర్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు.

కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఆ తర్వాత చెన్నైలో’బొమ్మరిల్లు’, విజయ్, మ్యాగజైన్లను ప్రారంభించారు.

అప్పట్లో’విజయ’లో వచ్చిన బాపినీడు సినిమా రివ్యూలు అర విపరీతమైన ప్రేక్షకాదరణ పొందాయి. దీనితోనే ఆయన పేరు విజయ్ బాపినీడు గా మారింది.

ఆ తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన విజయ బాపినీడు 1981లో దర్శకుడిగా మారారు.

‘డబ్బు డబ్బు డబ్బు’అనే సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న బాపినీడు మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. చిరంజీవితో’పట్నం వచ్చిన పతివ్రతలు’,’మగమహారాజు’,’మహానగరంలో మాయా గాడు’,’హీరో’,’మగధీరుడు’, సినిమాలతో పాటు మెగాస్టార్ వందో చిత్రం’ఖైదీ నంబర్ 786’ను కూడా విజయ బాపినీడే తెరకెక్కించడం విశేషం.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం’గ్యాంగ్ లీడర్’ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. చిరంజీవి తర్వాత రాజేంద్రప్రసాద్ తో బాపినీడు ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు.

శోభన్ బాబు, కృష్ణ, మోహన్ బాబు వంటి సీనియర్ నటులతో పని చేశారు. దర్శకుడిగా 22 సినిమాలకి దర్శకత్వం వహించారు ‌.

శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో,’యవ్వనం కాటేసింది’సినిమాను నిర్మించారు. అలాగే స్నేహితులతో కలిసి మరో 12 చిత్రాలు నిర్మించారు. మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో ‘చిరంజీవి’అనే మ్యాగజైన్ ను కూడా బాపినీడు నడిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *