వైసీపీ తీర్థం పుచ్చుకున్న మరో ఇద్దరు టిడిపి ఎంపీలు…

నిజానికి ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు టీడీపీ ఎంపీలు చేరతారనే ప్రచారం జరిగింది. ఒకరి పేరు నిన్ననే ఖరారైపోయింది.

అవంతి శ్రీనివాస్‌ టీడీపీని వీడుతున్నారంటూ తొలుత ‘కూత’ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే కావడం గమనార్హం.

టీడీపీ ఇలాంటి వార్తల్ని ప్రచారంలోకి తీసుకురావడం దిట్ట. టీడీపీ నేతలే, తమ అనుకూల మీడియాకి ముందుగా లీకులిస్తుంటారు.. పార్టీలో తమకు నచ్చని నేతల విషయంలో ఆ మాటకొస్తే, అవంతి శ్రీనివాస్‌ టీడీపీని వీడతారన్న వార్త ఇప్పటిది కాదు, చాలాకాలం క్రితం నుంచే విన్పిస్తోంది.

ఆయన ‘పార్టీ మార్పు’ ప్రచారంపై మొదటి నుంచీ ఒకింత ‘చిత్రంగా’ వ్యవహరించారు. టైమ్‌ చూసి, టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు.

తనతోపాటు మరో ఎంపీని కూడా వైఎస్సార్సీపీలోకి తీసుకెళ్ళాలని అవంతి శ్రీనివాస్‌ ప్రయత్నించారుగానీ, టీడీపీ అధిష్టానం కాస్త ముందే అప్రమత్తమవడంతో ఆ రెండో ఎంపీ పార్టీ మార్పు కాస్త వాయిదా పడిందంతే.

ఆయన ఇంకెవరో కాదు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు.ఇదిలావుంటే, మరో ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చే ఆ ఎంపీ, ఈ మధ్యనే వైఎస్సార్సీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో సంప్రదింపులు జరిపారట.

అలా మొత్తంగా ముగ్గురు ఎంపీలపై వైఎస్సార్సీపీకి ఓ క్లారిటీ వచ్చేసింది. ముగ్గురు కాకపోయినా, ఇద్దరు పక్కా.. అనే ఆలోచనతో, ‘ఇద్దరు పార్టీ మారుతున్నారు’ అని వైసీపీ ముఖ్యనేత ఒకరు ఈరోజు ఉదయం ప్రకటించేశారు.

అదీ అసలు సంగతి.ఇదిలావుంటే, దాదాపు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది.

ముగ్గురు ఎంపీలూ తమవెంట ఇద్దరేసి ఎమ్మెల్యేలను, వీలైతే ఇంకాస్త ఎక్కువమంది ఎమ్మెల్యేలను ఇతర ముఖ్యనేతల్ని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకెళ్ళేందుకు ముందస్తుగానే ప్లాన్‌ రెడీ చేసుకున్న దరిమిలా.. రానున్న రోజుల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఓ రేంజ్‌లో కన్పించబోతున్నాయన్నది నిర్వివాదాంశం.

ఇక, షరామామూలుగానే చంద్రబాబు గగ్గోలు పెట్టడం మొదలెట్టేశారు పార్టీ మారుతున్న నేతల మీద. ‘పదవులు అనుభవించి వెళ్ళిపోయారు..’ అంటూ చంద్రబాబు తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారు.

జనానికి అన్నీ కన్పిస్తున్నాయి..

పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా తెలంగాణలో చంద్రబాబు అభివర్ణించిన వైనం..

అదే రాజకీయ వ్యభిచారాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఆయనగారు ప్రోత్సహించిన వైనం..

ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతున్న నేతలపై వికారపు వ్యాఖ్యలతో చంద్రబాబు విరుచుకుపడటం..

అన్నీ అందరికీ అర్థమవుతున్నాయి.

పాత విషయాల్ని మర్చిపోవడమే అల్జీమర్స్‌ అయితే.. మర్చిపోయి, మర్చిపోనట్టు.. వ్యవహరించడాన్ని ఏ తరహా వ్యాధిగా పరిగణించాలి.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *