ఒక్క హీరోతో..రెండు చాన్సులు

ఇక తెలుగు వైపు రావడం అంతా అనుకుంటున్న సమయంలో… అజ్ఞాతివాసి తర్వాత మళ్లీ అనిరుధ్ నాని నటిస్తున్న జెర్సీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఒక పాటని కూడా విడుదల చేశారు… మళ్లీ ఇంకో ఛాన్స్ కూడా అనిరుధ్ కు ఇచ్చింది నాని నే….

కొత్తగా షూట్ చేస్తున్న నాని విక్రమ్ కుమార్ సినిమాకు కూడా అనిరుద్ధ్ సంగీతం అందించడం విశేషం. జెర్సీ సినిమాకు అనిరుధ్ ను ఎంపిక చేయడం వెనుక ఉన్నది త్రివిక్రమ్….

త్రివిక్రమ్ కు అనిరుద్ బాగా క్లోజ్ కాబట్టి నిర్మాతలతో మాట్లాడి అనిరుధ్ కు జెర్సీ లో ఛాన్స్ కల్పించాడు… అరవింద సమేత సినిమా కోసం అనిరుధ్ ని సెలెక్ట్ చేసినప్పటికీ కొన్ని కారణాలవల్ల పక్కన పెట్టేశారు… అందుకే ఇప్పుడు దగ్గరుండిమరీ ఈ ఆఫర్ను ఇచ్చినట్లు సమాచారం…

అనిరుద్ కు విక్రమ్ కుమార్ సినిమా ఆఫర్ రావడానికి కారణం మాత్రం నాని నే… జెస్సీ సినిమాలో అనిరుధ్ వర్క్ నానికి బాగా నచ్చిందట అందుకే మరోసారి అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

జెస్సీ సినిమా షూటింగ్ మొన్ననే పూర్తి చేసుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విక్రమ్ కుమార్ సినిమాను ఇవాల్టి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు నాని. ఒక వైపు షూటింగ్ తో పాటు మరోవైపు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ప్రియాంక అనే కొత్త అమ్మాయి ని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు.. మిగతా ఇద్దరు ఇద్దరు హీరోయిన్లు త్వరలోనే తెలపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *