వైఎస్సార్ తీసుకున్న రెండు నిర్ణయాలు…

1 రాష్ట్రంలో నీటి పంపిణీ విషయంలో వైస్సార్ తీసుకున్న బహు ప్రాజెక్టుల నిర్మాణాలు. మన కంటి ముందు జరిగీ, మనకు ఇప్పటికిప్పుడు లాభం వస్తుందా అనే ఆలోచనలతో మనలో చాలా మంది ఉంటారు, కానీ, దీర్ఘకాలిక ప్రయోచనల గురించి తక్కువ ఆలోచిస్తారు; ఈ క్రమంలోనే చాలా మందికి, వైస్సార్ నీటి పంపిణీ ప్రాజెక్టుల నిర్మాణాల విలువ గుర్తించలేకపోతున్నారు; ఇటువంటి నిర్మాణాల ఆలోచన & అమలు, ఇప్పటి వరుకు ఏ నాయకులు చేయలేదు, అలాగే ముందు, ముందు, మనలో ఎవరు చెయ్యలేరు; ఎందుకంటే, ఆయన ప్రారంభించి వెళ్లారు, 8 కోట్ల ప్రజలకు చేసి వెళ్లారు; కాకపోతే, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి; అది ఆయనకే సాధ్యం; పొగడటం కాదు, జరిగిన వాస్తవం..
2 తెలుగు సంస్కృతి కి ఆయన పరోక్షంగా అయన పంచె కట్టు తో ఒక విలువ తీసుకుని వచ్చారు; మీరు చరిత్ర పరిశీలిస్తే, అయన రాజకీయ జీవితం మొదలు నుండి చివరి వరకు, మొదటి సారి ఎమ్యెల్యే ఎన్నికల పోటీ ప్రచారాలు నుండి ముఖ్యమంత్రి పదవి వరుకు, అయన పంచ కట్టులోనే ఉన్నారు; పొగడటం కాదు, జరిగిన వాస్తవం; ఆఖరికి అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్ వచ్చినప్పుడు కూడా పంచె కట్టులోనే ఉన్నారు! అయన అమెరికా లోని కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ను కలిసినప్పుడు suit లో ఉన్నారు; అంటే మన దేశంలో మన సంస్కృతి, వాళ్ళ దేశాలలో వాళ్ళ సంస్కృతి; ఎన్టీఆర్ మొదటి ఎన్నికల ప్రచారంలో ఒక dress code, ముఖ్యమంత్రి అయినతరువాత పంచెకట్టు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినతరువాత yellow code లోకి వచ్చారు, వైస్సార్ లాగా చంద్రబాబు పంచె తో ఒక సభకు, ఒక టీవీ ప్రోగ్రాంకు వెళ్ళిన సందర్భము కూడా ఉంది! Facts!!!