గండిపేట లో విషాదం….

ఆడుతూ పాడుతూ ఓ చిన్నారి కరెంట్ పోల్ ను ముట్టుకుని మృత్యువు ఒడికి చేరింది…

నగర శివారు ప్రాంతంలో గండిపేటలో ఓ చిన్నారి ఆడుకుంటూ కరెంట్ పోల్ పట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ చిన్నారి ఎంతసేపటికి కదలడం లేదు. వెళ్లి చూడగా ఆ చిన్నారి చనిపోయాడు.

తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం పెబల్ సిటీ లో ఉంటుంది.. వారికి ఒకటో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు. మంగళవారం అతను ఆడుకుంటూ కరెంట్ పోల్ వద్దకు వెళ్ళాడు.. ఆ కరెంట్ పోల్ వైర్లు బయటికి ఉన్నాయి.. ఆ బాలుడి పేరు మణిదీప్ గా తెలిసింది.

ఈ సంఘటన ఆ బాలుడు కరెంటు పోల్ పట్టుకుని ఆడుకోవడం తో జరిగిందని తెలుస్తోంది.

కానీ బయటకు వచ్చిన వైర్లు అతని ప్రాణాన్ని తీసుకున్నాయి. ఈ ప్రమాదంపై పెద్దలు సిటీలో ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ వద్ద నుంచి మెయింటనెన్స్ చార్జీలు తీసుకుని కూడా కరెంటు వైర్లు బయటకు వచ్చిన సరిగా చూసుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ ఉన్నా సెక్యూరిటీ సిబ్బంది కూడా డమ్మీ క్యాండిడేట్స్ అని మండిపడుతున్నారు.

ఈ బాలుడు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పిల్లాడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

బాలుడు చనిపోయిన వీడియో చూసినా హృదయం ద్రవిస్తుంది. ఈ బాలుడు‌ తో పాటు మరో బాలుడు కూడా ఆడుకుంటున్నారు.

మరో బాలుడు సైకిల్ పైన వస్తుండగా, ఈ చిన్నారి ఆ సైకిల్ ముందు చిన్నగా పరిగెత్తుతూ వెళ్లి కరెంట్ పోల్ పట్టుకున్నాడు.

దానిని చేతితో పట్టుకుని తిరిగే క్రమంలో పట్టుకున్న క్షణంలోనే కదలకుండా ఉండిపోయాడు.

ఆ తరువాత మరి కొద్ది క్షణాల్లో కిందపడిపోయాడు.. అప్పుడు చనిపోయినట్లుగా గ్రహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *