జగన్ తో టచ్ లో టాలీవుడ్ కింగ్ పిన్?

టాలీవుడ్ లో కింగ్ పిన్ ఆయన. తెరవెనుకే వుండి చక్రం తిప్పడంలో సిద్దహస్తులు. తన పేరు బయటకు రానివ్వరు. కానీ సనిమారంగంలోని ప్రతిచోటా తన మనుషులు వుండేలా చూసుకుంటారు. తనవాళ్లే ఎన్నికయ్యేలా చూసుకుంటారు.
పైకి తన ప్రమేయం కనిపించకుండానే అన్ని వ్యవహారాలను శాసిస్తుంటారు. పైగా ఆంధ్ర సిఎమ్ చంద్రబాబుకు బాగా దగ్గర అని పేరు.
అయితే వ్యాపార దక్షతకు మారుపేరు అయిన ఆయన, రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అటు కేసిఆర్ కు కూడా దగ్గరయిపోయారు.
ఇద్దరు ముఖ్యమంత్రులతో సఖ్యత, పలుకుబడి చాలా జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఇక్కడో కాలు, అక్కడో కాలు అన్నట్లు, అన్నిచోట్లా తనమాట చెల్లేలా చేసుకుంటున్నారని టాలీవుడ్ లో టాక్ వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఆయన త్రివిక్రముడి మాదిరిగా మూడోకాలును జగన్ క్యాంప్ లో పెట్టినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా ఆయన జగన్ తో కంటిన్యూగా టచ్ లో వున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
భవిష్యత్ ను ఊహించారో, ఊహిస్తున్నారో మరి ఆయన ఉన్నట్లుండి మూడు నెలలుగా జగన్ క్యాంప్ కు, ఆపై జగన్ కు టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి అత్యంత లాయలిస్ట్ అని పేరుంది. ఆయన కుటుంబానికి ప్రజాపదవుల నేపథ్యం వుంది.
అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచే. మరి అలాంటిది ఉన్నట్లుండి ఈ టర్నింగ్ అన్నది టాలీవుడ్ లో డిస్కషన్ గా వుంది.
వాస్తవానికి ఆయన గతంలో విశాఖలో తన వ్యాపారాలకు సంబంధించి వైఎస్ నుంచి ఉపకారం పొందారని గుసగుసలు వున్నాయి.
తరువాత మళ్లీ తెలుగుదేశంలో తన మూలాలు అలాగే వుంచుకున్నారు.
ఆంధ్రలో వ్యాపారాలు దండిగా వున్నందున, ఎందుకయినా మంచిది అని ముందుగానే జగన్ తో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
బాబుకు దూరమవుతున్న టాలీవుడ్ అవసరార్థం పాదసేవ అన్నది నానుడి. అవసరం