తిరుమల తిరుపతి వార్షిక బడ్జెట్

తిరుమల తిరుపతి దేవస్థానం 2019 _20 ఆర్థిక సంవత్సరానికి. 3,116.25 కోట్లతో బడ్జెట్ ను ఆమోదించింది. అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని దేవస్థానం ధర్మకర్తల మండలి మంగళవారం తిరుమల లో సమావేశం అయింది.

ఇందులో ప్రధానంగా హుండీ ద్వారా రూ.1.231 కోట్లు,

డిపాజిట్లపై వడ్డీ రూపేనా రూ.845.86 కోట్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం ,

వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా రూ.235 కోట్లు.

ప్రసాదాల విక్రయం ద్వారా రూ.270 కోట్లు,

తలనీలాల విక్రయంతోరూ.100 కోట్లు,

విశ్రాంతి గృహాలు అద్దె రూపంలో రూ.105 కోట్లు,

రుణాలు, దుకాణాల అద్దె టోల్ గేట్ల రుసుము ప్రచురణలు తదితర ల ద్వారా రూ.204.85 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

వార్షిక బడ్జెట్లో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలనే నిబంధన మేరకు రూ.78.85 కోట్లు కేటాయించనుంది. గతంలో ఏటా రూ.500 కోట్లకు పైగా డిపాజిట్ చేస్తుండగా నిర్వహణ వ్యయం పెరగడంతో డిపాజిట్లు మొత్తాన్ని అంతకంతకు తగ్గించడం ఆందోళన కలిగించే పరిణామం గా తితిదే వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తం బడ్జెట్ లో వెయ్యి కోట్లకు పైగా జీతాలు ,పెన్షన్లకు ఖర్చు కానుంది గతంలో ఎన్నడూ లేనంతగా అధిక మొత్తంలో ఇంజనీరింగ్ పనులకు రూ.400 కోట్లు కేటాయించింది. ఇందులో దేవాలయ నిర్మాణానికి 100 కోట్లు, రహదారులకురూ.210 కోట్లు, హిందూ ధర్మ పరిరక్షణకు రూ.179 కోట్లు, విద్య, వైద్యశాలల నిర్వాహణ ఇతరత్రా విరాళాల కోసం రూ.139 కోట్లు వెచ్చించాలని పాలకమండలి సంకల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *