విశాఖ జిల్లా గాజువాక లో విషాదం ద్రావకం తాగి ముగ్గురు మృతి

నాటు సారా గా భావించి ప్లాస్టిక్ డబ్బాలో ని దావకo తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు .

విశాఖ జిల్లా గాజువాక లోని స్వతంత్ర నగర్ సమీపంలోని ఎస్టీ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

పందుల పెంపకం, చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉంటున్నాయి.

శనివారం సాయంత్రం నడుపూరు గడ్డ వద్ద అప్పలమ్మ( 65) చిత్తు కాగితాలు ఏరుతుండగా తుప్పల్లో 10 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ దొరకడంతో ఆ మె ఇంటికి తీసుకొచ్చింది.

అందులో ఉన్న ద్రావకాన్ని నాటుసారా గా భావించి కొంచెం తాగింది ,అనంతరం పక్క వీధిలో ఉంటున్న ఆసనాల కొండోడు( 64), వాడపల్లి అప్పడు (48) కూడ తలో glass తాగారు. స్థానికంగా మరో పదిమందికి దాన్ని పంచారు.

ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన అప్పలమ్మ, ఆసనాల కొండడు, వాడపల్లి అప్పుడు, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

వాడపల్లి అంకమ్మ( 56)కు గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరో పదిమందిని కేజీహెచ్కు తరలించారు. అప్పలమ్మ ఇంట్లో దొరికిన ప్లాస్టిక్ క్యాన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాధితులు తాగిన ద్రావకం ఏవియేషన్ ఇoదనoగా అనుమానిస్తున్నారు.

ఇదియే ద్రావకము ఇప్పుడే చెప్పలేమని ఫోరెనిక్స్ ల్యాబ్ కి నమూనాలను పంపుతున్నామని విశాఖ సౌత్ ఏసిపి ప్రవీణ్ కుమార్, గాజువాక సీఐ కోరాడ రామారావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *