బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు మూడు వారాల్లో.. పాల్గొనబోయే బుల్లితెర ముగ్గురు హాట్ బ్యూటీలు..

బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు మూడు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేస్తారని తెలుస్తోంది.

ఇక ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో ఉంది. ఈ లిస్ట్‌లో ముగ్గురు బ్యూటీలు చేరాయి.

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైందనే చెప్పాలి.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 2017, 1 జూలై 16న ప్రారంభం కాగా.. సీజన్ 2 ఒకనెల ముందుగానే అంటూ జూన్ 10నే ప్రారంభమైంది.

ఇక సీజన్ 3 మళ్లీ జూలై 21కి వెళ్లింది. అయితే సీజన్ 4 జూన్ నెలలోనే ప్రారంభించాలనే ప్రయత్నాలను కరోనా కట్టడి చేయడంతో జూలై నెలకు జరుపుకోక తప్పులేదు.

ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించిన అన్ని కసరత్తులు పూర్తి కావడంతో త్వరలో బిగ్ బాస్ సీజన్ 4ని ప్రారంభించబోతున్నారు నిర్వాహకులు.

ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.

అయితే ఇప్పటి వరకూ బిగ్ బాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కాని.. లీక్‌లు కాని బయటకు రాకపోవడంతో ఇవన్నీ రూమర్స్ మాత్రమే.

అయితే యాంకర్ వర్షిణి, విష్ణు ప్రియ, సుధీర్, రష్మి, జబర్దస్త్ వేణు, యాంకర్ ఉదయభాను, బిత్తిరిసత్తి, ఇలా చాలా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ హౌస్‌కి గత మూడు సీజన్లుగా గ్లామర్ కొరవడిందనే కంప్లైంట్‌తో ముగ్గురు అందగత్తెల్ని రంగంలోకి దింపుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు.

బాస్ ఫేమ్ ముంబై భామ పూనమ్ భజ్వాతో పాటు.. ఐటం భామలు హంసా నందిని, శ్రద్ధాదాస్‌లను బిగ్ బాస్ సీజన్ 4కి తీసుకువస్తున్నారట.

నిజానికి శ్రద్ధాదాస్ గత సీజన్‌లోనే బిగ్ బాస్ హౌస్‌లోకి రావాల్సి ఉండగా.. హీరో వరుణ్ సందేశ్ ఉండటంతో డ్రాప్ అయ్యిందని రూమర్లు వచ్చాయి.

అతనితో లవ్ బ్రేకప్ కారణంగానే ఈ డెసిషన్ తీసుకుందట శ్రద్ధాదాస్.

అడగ కుండానే అందాలు దారబోసే శ్రద్దాదాస్, హంసా నందిని లాంటి వాళ్లు బిగ్ బాస్‌కి వెళ్తే హాట్ డోస్ మామూలుగా ఉండకపోవడంతో పాటు రచ్చ కూడా అదే రేంజ్‌లో ఉండటం ఖాయమే.

ఇక గత మూడు సీజన్లు.. అందులో పాల్గొన్న సెలబ్రిటీలు, విన్నర్ లిస్ట్‌ చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి టాప్ రేటింగ్స్ వస్తుండంటతో తెలుగులో తొలిసారిగా 2017 జూలై 16న ప్రారంభించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమానికి హోస్ట్ చేసి హైప్ తీసుకువచ్చారు.

ఈ సీజన్‌లోఅర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, జ్యోతి,

సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివ బాలాజీ, ఆదర్శ్, హరి తేజ, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్).. ఈ 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్నారు.

వీరిలో ఫైనల్ కన్టెస్టెంట్స్‌గా ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చనలు పోటీ పడగా.. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచి రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు.

ఇక రెండో సీజన్ విషయానికి వస్తే.. 2018 జూన్‌లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభమైంది.

ఈ సీజన్‌లో గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా,

యాకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్ నాయుడు, నందినిలు కంటెస్టెంట్స్‌గా ఉండగా..

బుల్లి తెర నటుడు కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్‌గా అవతరించాడు.

ఇక మూడో సీజన్.. 2019 జూలై 21న ప్రారంభంంకాగా..

యాంకర్ శివజ్యోతి, టీవీ నటుడు రవికృష్ణ, అశురెడ్డి, జర్నలిస్ట్ జాఫర్, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ నటి రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీ రజా, మహేశ్ విట్ట, శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్..

ఆయన సతీమణి వితికా షెరు, యాంకర్ శిల్పా చక్రవర్తి (వైల్డ్ కార్డ్) కంటెస్టెంట్లు ఉన్నారు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా అవతరించగా.. శ్రీముఖికి రన్నరప్ టైటిల్ దక్కింది.

మరి బిగ్ బాస్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పుడు షో ప్రారంభం కాబోతుందనే ఆసక్తితో బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *