ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు*

జూబ్లీహిల్స్ పోలీసులు మరో ముగ్గురు నిందితులుని అరెస్ట్ చేశారు.విశాల్, నగేష్, సుబాష్ రెడ్డి లను మంగళవారం అరెస్ట్ చేశామని, హత్యోదంతంలో రాకేష్ రెడ్డి కి వీరు ముగ్గురు సహకరించినట్లు సాక్షాధారాలు లభించాయని పశ్చిమ మండలం డిసిపి శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు.

జైరాం హత్య జరిగిన రోజు జనవరి 31 ,2019 విశాల్, నగేష్ ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు.

హత్యోదంతంలో వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, జయరాం చేతులను విశాల్ గట్టిగా పట్టుకో గా రాకేష్ రెడ్డి గొంతు నులమడoతొ పాటు, దిండుముఖo పై ఉంచి ఊపిరాడకుండా చేయడంతో ఆయన చనిపోయారు.

జైరాం మేనకోడలు శిఖ చౌదరి పై కేసు నమోదు చేశామని ఆమెను మరోసారి విచారిస్తామని తెలిపారు.

శిఖాచౌదరితో పరిచయమయ్యాక ఆమెతో స్నేహం కొలది తాను 1.37 కోట్లు ఖర్చు పెట్టినట్టు రాకేష్ రెడ్డి కొద్ది నెలల క్రితం జయరామ్ తొచెప్పాడు.

శిఖా చౌదరి కి బదులుగా తాను ఆ సొమ్ము ఇస్తానంటూ జయరాం అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఒప్పందం డబ్బు రాబట్టుకునే క్రమoలొ నిందితుడిని బెదిరించాలని పథకం వేసాడు.

తానకు సహకరిస్తే లక్షలు ఇస్తాన oటూ విశాల్, నగేష్ లకు నాలుగు నెలల క్రితమే చెప్పాడు.

నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ వెంటనే దానికి ఒప్పుకున్నారు వారు ఆ విషయాన్ని తమ ఉమ్మడి స్నేహితుడు సుభాష్ రెడ్డి చెప్పగా అతను. తన పేరుతో సిమ్ కార్డు తీసుకుని వారికి ఇచ్చాడు.

పథకం ప్రకారం జనవరి 30న జైరాంను హని ట్రాప్ ద్వారా రాకేష్ రెడ్డి తన ఇంటికి రప్పించాడు.1. 37 కోట్లు ఇప్పుడే ఇవ్వాలంటు బెదిరించాడు డబ్బు కోసమే జయరా o తో అతని సన్నిహితులకు ఫోన్ చేయించాడు.

ఆరు లక్షలు మాత్రమే లభించడంతో అ గ్రహించాడు కాళీ దస్తావేజులపై సoతకo చేయించుకున్న అనంతరం జయరాం ను హత్య చేశాడు.

ఆ మొత్తం పరిణామాలను వీడియో తీశారు దాన్ని సుభాష్ రెడ్డి కి పంపించారు అని డిసిపి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *