ఏ నోటీసూ లేదు..అధికారులు కూడా ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు

జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏఎమ్బీ మల్టీఫ్లెక్స్ కు ఏ నోటీసూ ఇవ్వలేదని థియేటర్ యాజమాన్యం తరపున ఏషియన్ సునీల్ తెలిపారు.

అధికారులు థియేటర్ కు వచ్చినమాట వాస్తవమే అని, అయితే తాము జీఎస్టీ తగ్గించే టికెట్ లు విక్రయిస్తున్నామని, ఆ రికార్డులే అడిగారని, ఇచ్చామని వివరించారు.

అంతేతప్ప తమను ఏ పెనాల్టీ కట్టమని ఎటువంటి నోటీసూ ఇవ్వలేదని వివరించారు.

నోటీసు ఇచ్చినా, ఎంత కట్టాలో చెప్పినా, వెంటనే కట్టడానికి తాము సిద్దంగా వున్నామని, నోటీసులు ఇచ్చారన్న వార్తలు తెలిసి, అధికారులు కూడా ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు.

ఎఎమ్బీ థియేటర్లు ఎటువంటి నిబంధనల అతిక్రమణకు పాల్పడవని, అధికారులు ఎలా లెటర్ ఇస్తే, అలా చేస్తామని వెల్లడించారు. ఈరోజో, రేపో సంబంధిత అధికారులను కలుస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *