పచ్చ సర్వేల్లోనే టీడీపీ అంత వీక్ గానాఎలాగైనా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని ఆ మీడియా వర్గాలు చేయని ప్రయత్నం అంటూ లేదు

పచ్చ సర్వేల్లోనే టీడీపీ అంత వీక్ గానా!

ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతున్న వేళ తెలుగుదేశం అనుకూల మీడియా ఆ పార్టీ కోసం తన సర్వశక్తులనూ ఒడ్డి పని చేస్తూ ఉంది. ఎలాగైనా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని ఆ మీడియా వర్గాలు చేయని ప్రయత్నం అంటూ లేదు.

చంద్రబాబు గెలిస్తే ఆ ఆరు మీడియా హౌస్ లూ గెలుస్తాయని, కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించుకోవడానికి ఆ మీడియా వర్గాలు తెలుగుదేశం పార్టీ కోసం అంతలా కష్ట పడుతూ ఉన్నాయని..కులం, ధనం అనే సమీకరణాలతోనే ఆ మీడియా వర్గాలు మొత్తం ఏపీ ప్రజలకు కళ్లకు గంతలు కడుతూ ఉన్నాయనే విశ్లేషణలు కొత్తవి ఏమీ కావు.

అయినప్పటికీ ఆ చానళ్ల తీరు ఏమీ మారడం లేదు. అలానే సాగుతూ ఉంది. అందులో భాగంగా సర్వేలను కూడా విడుదల చేయడం మొదలైంది.

అందులో భాగంగా ఆదివారం ఒక పచ్చ చానల్, తోక పత్రిక ఒక సర్వేను వెల్లడించింది.

అది ఎలాగూ పచ్చ చానల్. దాని సర్వే పచ్చపాతంతోనే ఉంటుందని చెప్పనక్కర్లేదు. అందులో భాగంగా ఆ చానల్ చెప్పిన నంబర్లే విడ్డూరంగా ఉన్నాయి.

తెలుగుదేశం గెలిచేస్తుందని ఆ మీడియా చెప్పడంతో ఆశ్చర్యం లేదు కానీ.. తెలుగుదేశం పార్టీకి మరీ తక్కువ సీట్లనే చూపింది! కార్పొరేట్ చాణక్య పేరుతో ఈ సారి లీక్ వదిలింది.

ఇంతకు ముందు లోక్ నీతి- సీఎస్డీఎస్ పేరుతో సర్వేను వదిలారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఆ ప్రయత్నం చేయడంతో అభాసుపాలయ్యారు.

తాము సదరు మీడియా వర్గంతో ఎలాంటి సర్వేనూ పంచుకోలేదని స్వయంగా లోక్ నీతి ప్రకటన చేసింది. ఇప్పుడు కార్పొరేట్ చాణక్య అంటూ కొత్త పేరును ఎన్నుకున్నారు.

దీని ప్రకారం తెలుగుదేశం పార్టీకి నూటా ఒక్క సీట్లు వస్తాయట, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఒకటి, జనసేనకు మూడు సీట్లు వస్తాయట! ఆ సర్వే అలా చెప్పింది కాబట్టే టీడీపీ మీడియా దాన్ని కవర్ చేసిందని వేరే చెప్పనక్కర్లేదు.

ఇంతకీ సదరు కార్పొరేట్ చాణక్య మూలాలు ఏమిటి అంటే..దాని ఫౌండర్ పేరు గోనుగుంట్ల అనిల్ కుమార్ చౌదరి అట.

అతడు తెలుగుదేశం పార్టీ వినుకొండ అభ్యర్థి జి.వెంకట అంజనేయులకు బంధువు అని తెలుస్తోంది.

ఆ పరిచయాలతోనే ఆ సర్వే అలా ఉందని, లోక్ నీతి పేరుతో చేసిన ప్రచారం ఎదురుతన్నడంతో ఈ సారి తమ బంధువు కంపెనీ సర్వేతోనే తెలుగుదేశం పార్టీ మీడియా వచ్చిందని స్పష్టం అవుతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *