వేగంగా వీస్తున్న ఫ్యాన్ గాలి

రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వైకాపా ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడ మొహమాటానికి తావివ్వకుండా గెలుపు గుర్రాలను వైయస్ జగన్ ఎంపికచేసి టిక్కెట్లు కేటాయించారు.
అభ్యర్థుల సమర్థతను ,అంగ ,అర్థ బలం పరoగా బేరీజు వేసుకున్న కే ఎంపిక చేశారు. ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడింది తానేనని చెప్పుకొస్తున్నారు.
రాష్ట్రానికి “ప్రత్యేక హోదా “ఎవరిస్తే కేంద్రంలో వారికేమద్దతు ఇస్తామని చెబుతున్నారు.
“నవరత్నాలు “పేరిట ఎన్నికల ప్రణాళికను రెండేళ్ల కిందటే జగన్ ప్రకటించి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర సెంటిమెంట్ పైనే జగన్ నమ్మకం పెట్టుకున్నారు.
తన పర్యటనలో నవరత్నాలు ప్రధానంగా ప్రచారం చేశారు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన దరిమిలా సెంటిమెంట్ పనికి వస్తుందని వైకాపా భావిస్తోంది.
ప్రజల్లో జగన్ కు ఉన్న ఆదరణ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసి అధికారానికి చేరువ చేస్తోందని నమ్మకంతో ఉంది.
ఎన్నికలకు ముందు” ఆపరేషన్ ఆకర్షణకు” జగన్ తెరలేపారు ,అధికార పార్టీ లక్ష్యంగా గడిచిన నెల రోజుల్లో పెద్ద ఎత్తున చేరిక లను ప్రోత్సహించారు.
ఒకే విడతలో 175 అసెంబ్లీ స్థానాలు, రెండు విడతల్లో 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి చేరినవారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్ లో చాలామందికి టిక్కెట్లు దక్కాయి.
జగన్ కు తెరాస నుంచి ప్రత్యక్షంగా బిజెపి నుంచి పరోక్షంగా ఊహాత్మక రాజకీయ మద్దతు లభించడం అదనపు భారంగా మారింది.
వైకాపా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో 41 మంది బీసీ లకు అవకాశం కల్పించామని, గత ఎన్నికల్లో మైనార్టీలకు నాలుగు సీట్లు ఇవ్వగా ఇప్పుడు 1 పెంచి ఐదుగురికి ఇచ్చాము.
ప్రజాభిప్రాయం సర్వే ఆధారంగా ఎవరైతే మంచి అభ్యర్థి అవుతారని అనుకున్న చోట కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈసారి టికెట్ ఇవ్వలేదు.
దేవుడి దయ ,నాన్న దీవెన ప్రజల ఆశీస్సులతో జాబితాలో ఉన్న వారంతా గెలవాలని ఆశిస్తున్నాను అని ఆకాంక్షించారు.