ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌లా చేయాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు:ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీలో ‘ఫ్యాన్’.. తెలంగాణలో స్విచ్.. ఢిల్లీలో ఫ్యూజ్: చంద్రబాబు
ఏపీని మరో బీహార్‌గా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి.. 13జిల్లాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరిగిపోతుంది. ప్రజలు ఓట్లతో వైసీపీ రౌడీలకు తగిన గుణపాఠం చెబుతారు.
వైసీపీ అధికారంలోకి వస్తే గల్లీ, గల్లీకి రౌడీలుఏపీలో వైసీపీ తరపున టీఆర్ఎస్ వకాల్తాజగన్ బాధ్యతల్ని టీఆర్ఎస్ తీసుకుంది
ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌లా చేయాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో ఉద్రిక్తలు పెంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. వైసీపీ అధికారంలోకి వస్తే గల్లీ, గల్లీకి రౌడీలు తయారవుతారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
గతంలో హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించింది వీళ్లే.. ఎర్రచందనం ఆదాయం ఆగిపోయేసరికి వైసీపీ ఫ్రస్టేషన్‌లో ఉందన్నారు. మంగళవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబువైసీపీపై విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ ఉంటే.. స్విచ్ తెలంగాణలో ఉందని.. ఫ్యూజ్ ఢిల్లీలో ఉందంటూ వైసీపీపై సెటైర్లు పేల్చారు.
రాష్ట్రాన్ని ద్వేషించే వారితో జగన్ అంటకాగుతున్నారని.. ఏపీలో వైసీపీ తరపున టీఆర్ఎస్ వకాల్తా పుచ్చుకుందని విమర్శించారు. ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్ రెడ్డి విఫలమయ్యాక ఆ బాధ్యతలు టీఆర్ఎస్ తీసుకుందన్నారు.
రాష్ట్రంలో వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఏపీని మరో బీహార్‌గా చేయాలని కుట్రలు జరుగుతున్నాయని.. 13జిల్లాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరిగిపోతుందని.. చిత్తూరు, ఒంగోలు, దెందులూరు, కొండవీడు సంఘటనలే రుజువు చేశాయన్నారు. చంద్రగిరిలో రౌడీయిజంపై ప్రజలే తిరగబడ్డారని.. ప్రజలు ఓట్లతో వైసీపీ రౌడీలకు తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు అన్నారు.