యాత్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను అంగరంగ వైభవంగా నిర్వహించారు, కువైట్ వాసులు

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమాను మహి వి రాఘవ తెరకెక్కిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలోని కీలక ఘట్టమైన పాదయాత్రకు సంబంధించిన విషయాన్ని కీలకంగా తీసుకుని యాత్రను తెరకెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు.

వైయస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ నటించగా, కీలక పాత్రల్లో జగపతిబాబు, అనసూయ, సుహాసిని పలువురు ప్రముఖులు నటించారు.

70 ఎంఎం ఎంటెర్టైనమెంట్ పథకం పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు.

ఈ సందర్బంగా కువైట్ లో యాత్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

కువైట్ లోని TVS గ్రూప్ కంపెనీల అధినేత శ్రీ యస్.యం హైదర్ ఆలీ చేతులమీదుగా యాత్ర సినిమా పోస్టర్ మరియు టి షర్టులు విడుదల చేశారు.

ఈ కార్యక్రమం లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కోకన్వీనర్లు గోవిందు నాగరాజు ,యం. వి .నరసారెడ్డి, ప్రధాన కోశాధికారినాయని మహేశ్వరరెడ్డి, మీడియా ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, గౌరవ సలహాదారు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బిసిసెల్ ఇంచార్జ్ కె.రమణయాదవ్, యువజన విభాగం ఇన్ఛార్జ్ మర్రి కల్యాణ్.

మైనారిటీ విభాగం ఇంచార్జ్ షేక్ గఫార్. గల్ఫ్ మీడియా కోఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా,కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి, సభ్యులు మహబూబ్ బాషా హనుమంత్ రెడ్డి, పి.ప్రభాకర్ ,సుబ్బారెడ్డి,నూక శ్రీనువాలు రెడ్డి, సురేష్ రెడ్డి, ఆకేపాటి వసికర్ రెడ్డి, శంకర్ రెడ్డి,ఖాదరున్, గౌస్, రామారావు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఎన్నారైలు, వైఎస్సార్, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ కి హాజరైయి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేసారు.

ఈ సందర్బంగా యాత్ర ట్రైలర్, సాంగ్స్ ని ప్రదర్శించారు. సినిమా అద్భుతంగా తెరకెక్కించారని, వైయస్ఆర్ పాదయాత్రను మళ్ళీ ప్రజలకు చూపించడం ఆనందంగా ఉందన్నారు.

వారందరూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి బెస్ట్ అఫ్ లక్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *