సూర్యునిలాంటి వెలుగులు అంటే అతిశయోక్తి కాదేమో….స్త్రీ

పవిత్ర భారతదేశం లో …ఒక హైందవ స్త్రీమూర్తికి ఉన్న విలువలు ఈ విశాల జగత్తుకు స్త్రీలు శక్తి స్వరూపిణిలు* భారతదేశ భవిష్యత్తు స్త్రీల చేతిలో వుంది
త్యాగములొ..ప్రేమానురాగాలలొ..పట్టుదలలొ ..ఓర్పు సహనం..సహకారము వీటన్నిటిలొ స్త్రీలు .మహశక్తి సంపన్నులు భారతదేశ భవిష్యత్తు స్త్రీల చేతిలొఉందన్నారు స్వామి యత్రనార్యస్తు పూజ్యంతే..రమంతే తత్ర దేవతా

స్త్రీలు గౌరవింపబడే చోట దేవతలు స్థిర నివాస మేర్పరచుకుంటారట.
ముఖ్యంగా స్త్రీలలొ ఏడు శక్తులున్నాయని గీతాచార్యులు చెప్తారు.

1)”కీర్తి శ్రీ ర్వాక్చ నారీణాం స్మ్రుతి ర్మేథా థృతి క్షమాః
కీర్తి .జ్ఞానసంపద.మృదువైనవాక్కు..జ్ఞాపకశక్తి ..జ్ఞానం
(థారణాశక్తి)..థర్మమునందు థైర్యము..ఓర్పు నేనేఅగుచున్నాను”..అన్నాడు శ్రీ కృష్ణ పరమాత్మ

స్త్రీలు అబలలుకారు.. అవసరమైతే ఏపరిస్థితులైనా ఎదుర్కొను సబలలు.
రాణీరుద్రమదేవి..ఝాన్సీరాణి నుండీ నేటి ఇందిరా గాంథీ..విక్టోరియా రాణి,
లాంటి పరిపాలనా దక్షత వారి దీక్ష వారి సేవా దృక్పధము..దృఢసంకల్పము..వలన భారతదేశకీర్తిని పతాక.. చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ముందుకు వెళ్ళారు.. వారి అడుగు జాడలు లో పయనించే అవకాశం నేటి సమాజంలో స్త్రీల కోసం ఆ శక్తి యుక్తులను ఇమ్మని.. భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో.. దేశం కోసం.స్వామికోసం. మంచి కార్యక్రమాలు నేటి సమాజంలో స్త్రీలు నిర్వహించాలని.. ప్రార్ధిస్తూ.నేటి మహిళలందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ న్నాను…………

పుట్టినిల్లు ,మెట్టినిల్లు అనే తేడాలేకుండా అన్నింటా తానై ,తన రంగుల ప్రపంచాన్ని వదిలేసి ,మా పురుష ప్రపంచం లోకి వెలుగులు నింపేందుకే వచ్చిన ఓ త్యాగమయీ…. మా మనోజగత్తు యావత్తును వినయాన శాసించే ఓ అనురాగమయీ……ఓ స్త్రీమూర్తి ……,మీకు ,జోహార్లు శుభాకాంక్షలు ….మనసైన దీవెనలు……
………..మీ వేగి.లాస్య………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *