విశాఖ వాసులకు ప్రధాని మొండిచేయి రైల్వేజోన్ పై తీవ్ర నిరాశ మిగిల్చారు

విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదేళ్ల క్రితం నగరంలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బిజెపి నాయకులు జొన్ పై సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు.

ఆర్థికంగా వెసులుబాటు కాదనే వాదన తెరపైకి తెచ్చారు. ఆ తరువాత కమిటీ వేసాం జోన్ కు అడ్డంకి లేదు, కానీ రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కొంతకాలం చెప్పారు. ఐదేళ్లుగా కాలక్షేపం చేస్తూ వచ్చారు.

కేంద్ర ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కావడం ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడైన జోన్ ప్రకటిస్తారని ఎదురు చూసిన ఉత్తరాంధ్ర వాసులకు చివరికి నిరాశే మిగిలింది.

బిజెపి పార్టీ సీనియర్ నేత విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు జొన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు హామీకీ తాము కట్టుబడి ఉన్నామని ఈందుకు మూడు నెలల సమయం ఉందన్నారు.

అలాగే జోన్ ఏర్పాటు అనేది పార్లమెంట్ సమావేశాలతో సంబంధం లేదని అది పాలనాపరంగా తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు.

అయితే ఆయన వ్యాఖ్యలు వెనుక మర్మం ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటైనది దశాబ్దాల కల. ఇందుకు పార్టీలకు అతీతంగా పోరాటాలు సాగుతున్నాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ డిమాండ్లతో ఐదు రోజుల క్రితం ఉత్తరాంధ్ర చర్చ వేదిక ఆధ్వర్యంలో ఒక బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.

మరో వెపీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా పోరాడతూనే ఉన్నారు.

అసలు రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టం లో రైల్వే జోన్ అంశం పొందుపరిచారు.

అంటే రైల్వే జోన్ ఇచ్చి తీరాలి. జోన్ ఇవ్వడానికి విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి.

దేశ రైల్వే రంగంలో ఆదాయపరంగా వాల్తేరు డివిజన్ ఐదోస్థానంలో ఉంది.

సరుకు రవాణా రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. జోన్ ఏర్పాటుకు అవసరమైన భూములు మౌలిక వసతులు అన్ని వాల్తేరు డివిజన్ కు ఉన్నాయి.

సరుకు రవాణాకు సంబంధించి వ్యాపార విస్తరణకు అవసరమైన రెండు మేజర్ పోర్టులు లు వాల్తేర్ డివిజన్ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నాయి.

జోన్ కు అవసరమైన అర్హతలు వాల్తేరు డివిజన్ కు ఉన్నాయని అయితే ఇవ్వకూడదనే మొండివైఖరి తోనే బడ్జెట్లో పొందుపరచలేదని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *