జనసేన పార్టీకి వందకోట్లు పార్టీ ఫండ్ ఇస్తానని ఆఫర్ చేసారట.

రాజకీయ పార్టీలకు ఫండింగ్ అన్నది కామన్. అది తెదేపా, వైకాపా, జనసేన ఇలా ఏదయినా కావచ్చు.
అయితే గతంలో ఇలా ఫండ్ అనేది కాంట్రాక్టర్లు, బిజినెస్ మన్ ల దగ్గర నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు రాజకీయ వేత్తల నుంచే వస్తోంది.
ఒక టికెట్ కావాలి, రెండు టికెట్ లు కావాలి అని షరతులు పెట్టి, కాస్త స్టామినా, బ్యాక్ గ్రవుండ్ వున్న నేతలు పార్టీల్లోకి చేరుతున్నారు.
ఎన్నికల ఖర్చు పెట్టుకోవడంతో పాటు, పార్టీ ఫండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు.

పార్టీలు కూడా, సమర్థత వుండీ, ఎన్నికల ఖర్చు పెట్టుకుని, ఫండ్ ఇచ్చేవారంటే మొగ్గు చూపుతున్నాయి. ఇలా ఇవ్వగలిగిన వారు కూడా గెలుపు గుర్రాల్లాంటి పార్టీలను వెదుకుతున్నారు.
ఇదంతా చెప్పడం ఎందుకంటే ఈస్ట్ గోదావరి రాజకీయ వర్గాల్లో ఓ విషయం హాట్ గ్యాసిప్ గా వినిపిస్తోంది.
ఇటీవల జనసేన పార్టీలో చేరిన ఓ రాజకీయ నాయకుడు వందకోట్ల పార్టీ ఫండ్ ఆఫర్ చేసారట.
తనకు, తన భార్యకు ఈస్ట్ గోదావరికి గుండెకాయలాంటి ప్రాంతంలోని రెండు నియోజకవర్గాల్లో టికెట్ లు ఇవ్వాలని, ఎన్నికల ఖర్చు పెట్టుకుని, పార్టీకి వందకోట్లు ఫండ్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారట.
చిత్రమేమిటంటే ఇంత ఆఫర్ ఇచ్చిన వ్యక్తి అధికారపార్టీ నుంచి రాలేదట. మరి అంత ఫినాన్షియల్ స్టామినా వుందా ఈయనకు అని లోకల్ రాజకీయ నాయకులు ఆశ్చర్యపోతూ, గుసగుసలాడుకుంటున్నారు.
ఈస్ట్ లో జనసేనకు కాస్త స్థానాలు వస్తాయని ఆశ వుండడమే ఇందుకు కారణం అని లెక్కలు కడుతున్నాయి.