జాతీయస్థాయిలో భాజపా యేతర పార్టీలన్నీ ముందస్తు ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటే మేలని చంద్రబాబు హితవు

జాతీయస్థాయిలో బాజపాయేతర పార్టీలన్నీ ముందస్తు ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటే మేలని, ఆ దిశగా అన్ని పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తునని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ముందస్తు పొత్తు లేకపోతే ఎన్నికల తర్వాత భాజపా కి ఎక్కువ స్థానాలు వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సోమవారం మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలను చర్చించేందుకు మంత్రులతో ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన సమావేశని నిర్వహించారు.

రాష్ట్ర జాతీయ రాజకీయాలు తాజా పరిణామాలపై చర్చించారు, విపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని, దుష్ప్రచారని సమర్థంగా తిప్పి కొట్టడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల హడావిడి లో పడిపోయి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ముగ్గురు నలుగురు మంత్రులు తప్ప మిగతా వారు ఎవరు విలేకరుల సమావేశం నిర్వహించి విపక్షాలపై ఎదురు దాడి చేయడం లేదు మనం కౌంటర్ ఇవ్వకపోతే ప్రజల్లోకి వెళ్తుంది.

ఒకపక్క మోడీ, కేసీఆర్ ,జగన్ కలిసి రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే మంత్రులు ఇలా ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

జగన్కు అనుకూలంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం కే మేలు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అనగా అలా అని ఊరుకుంటే ఎలా? .

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు, విపక్ష పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు ఆ జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణ ,జవహర్ ఎందుకు ఖండించలేదు అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో జాతీయస్థాయిలోనే కలిసి పనిచేస్తామని రాష్ట్రంలో రాష్ట్రంలో ఆ పార్టీతో ఎలాంటి అవగాహన ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

బాజపాయేతర పార్టీలన్నిటినీ సంఘటితం చేస్తున్నామని ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ నెల 27న ఢిల్లీలో మరోసారి సమావేశం అవుతునమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *