“తుపాకి మాదే.. బుల్లెట్ మాదే’.. రష్మి సర్జికల్ ట్వీట్ *

పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? మాతోనే మీ అస్థిత్వం.. లేకపోతే మీరు మట్టితో సమానం.. పాక్‌లోని చాలా ప్రాంతాలను నేటికీ మా నాయకుల పేర్లతో పిలుస్తున్నారు’ అంటూ గతంలో పాకిస్థాన్ సపోర్టర్స్‌కి చుక్కలు చూపించిన రష్మి మరోసారి తన క్రియేటివీ మైండ్‌కి పదును పట్టి కత్తిలాంటి ట్వీట్ చేసి.
సర్జికల్ స్ట్రైక్‌పై యాంకర్ రష్మి అదిరిపోయే ట్వీట్రాజ్ కుమార్ ఫేమస్ డైలాగ్‌ను గుర్తు చేస్తూ టైమింగ్‌తో అదరగొట్టిన రష్మితుపాకి మాదే.. బుల్లెట్ మాదే.. కాని మీరు చచ్చే భూభాగం మీదే అంటూ పాక్‌కి స్ట్రాంగ్ వార్నింగ్నెటిజన్లను ఫిదా చేస్తున్న రష్మి ట్వీట్.
జై జవాన్.. జై భారత్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా ఈ నినాదాలే వినిపిస్తున్నాయి. దొంగదారిలో 40 మంది భారత సైనికుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది భారత్.
పాకిస్థాన్ ఆక్రమిత భూభాగంలో తలదాచుకొన్న జైషే ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళాలు మెరుపుదాడి చేసి దాదాపు 300 మందిని మట్టుబెట్టి పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించారు.
దీంతో దేశవ్యాప్తంగా భారత వైమానిక దళంపై ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరుల నుండి సెలబ్రిటీల వరకూ జై జవాన్ అంటూ నినదిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, మోహన్ బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సంపూర్ణేష్ బాబు, అఖిల్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా భారత సైన్యానికి సలాం చేయగా.. బుల్లితెర యాంకర్, హీరోయిన్ రష్మి చేసిన పోస్ట్ నెటిజన్‌లకు విపరీతంగా నచ్చేస్తోంది.
సూపర్ రష్మి ఇప్పుడు నచ్చావ్ అంటూ తెగ ప్రశంసిస్తున్నారు శాంతికాముకులం కాబట్టే నీ లాంటి బచ్చాగాళ్లను క్షమిస్తూ వస్తున్నాం.
ఇప్పటికైనా మూసుకుని కూర్చో’ అంటూ పుల్వామా ఉగ్రదాడిని సమర్ధించిన వారి తాట తీసిన రష్మి.
తాజాగా 300 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టి దాయాది దేశానికి తగిన గుణపాఠం చెప్పిన వాయు సైన్యం సేవలను, భారత పౌరుషాన్ని కీర్తిస్తూ వహ్ వా అనిపించే డైలాగ్‌ని పోస్ట్ చేసింది.
అలనాటి పాపులర్ హీరో రాజ్ కుమార్.. విలన్‌ని హెచ్చరిస్తూ చెప్పే ఫేమస్ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ సందర్భోచితంగా ఉపయోగించింది రష్మి.
‘మేము మిమ్మల్ని తప్పకుండా చంపుతాం.. మిమ్మల్ని చంపే తుపాకీ మాదే.. బుల్లెట్ కూడా మాదే.. చంపే టైం కూడా మాదే.. కాని ఒక్కటే తేడా మిమ్మల్ని చంపే భూమి మాత్రం మీదే అవుతుంది’ అంటూ రోమాలు నిక్కబొడిచే డైలాగ్‌ను సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా షేర్ చేసింది రష్మి.
ప్రస్తుతం రష్మి చేసిన ఈ డైలాగ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పర్ఫెక్ట్ టైమింగ్ రష్మి.. పాకిస్థాన్‌కి చుక్కలు చూపిస్తూ ట్వీట్స్‌తో తుక్కు తుక్కు చేస్తున్నావ్.. ఇలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తాయి అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.